ప్రస్తుత కాలంలో అప్పులు లేని వారు ఎవరూ ఉండరు.ఈ విధంగా అప్పులతో ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చాలామంది అప్పులు చేస్తుంటారు.మరి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించే మనకు అప్పులు తీర్చమని చాలామంది ఆ దేవతలను వేడుకుంటారు.
ఈ విధంగా అప్పులు సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు.మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ వరంగల్ హైవే చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనే వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి రుణబాధలు తీరుతాయని భావిస్తారు.
అసలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అప్పులు ఏవిధంగా తీరుతాయనే విషయానికి వస్తే.

పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం కోసం కుబేరుని వద్ద తీసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఆ అప్పులు తీర్చలేక వెంకటేశ్వరస్వామి ఎంతో గుబులుగా చింత చేస్తూ చిల్పూరు గుట్టకి వచ్చి అక్కడ గుహలో కుబేరుడి అప్పు తీర్చలేకపోయానన్న బాధతో తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా స్వామివారు అప్పు తీర్చలేక గుబులుతో ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ వెలిసిన ఎటువంటి స్వామివారిని గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఈ కొండకు స్వామివారి వచ్చినప్పుడు కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి.ఈ విధంగా స్వామివారి పాదాలు ఉన్నచోటును పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు.
ఇక్కడే ఒక అఖండ దీపం వెలిగించి అని పురాణాలు చెబుతున్నాయి.