ముఖ్యంగా చెప్పాలంటే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ( Dussehra festival ) కూడా ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆశ్వాయుజ మాసంలో ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు.
చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు.ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది.
పురాణాల ప్రకారం ఆశ్వాయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున రాముడు రావణుని పై విజయం సాధించాడని పండితులు( Scholars ) చెబుతున్నారు.అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్లి జమ్మి చెట్టుపై ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతున్నారు.
దసరా పండుగ రోజులలో రావణ వధ, జమ్మి చెట్టుకు పూజ చేయడం సాంప్రదాయంగా ఉంది.
జగన్మాత తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి ఆ రాక్షసున్ని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా పదవరోజు ప్రజలంతా సంతోషమంతో పండుగ జరుపుకున్నారు.బ్రహ్మ దేవుని వరాల వల్ల గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడని గ్రంథాలలో ఉంది.ఇంకా చెప్పాలంటే విజయదశమి రోజు శ్రావణ నక్షత్రం( Sravana Nakshatra ) ఉంటుంది.
ఈ నక్షత్రం మండపంలో శ్రావణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని చెబుతున్నారు.కాబట్టి ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు.అలాగే ఆరోజు జమ్మి చెట్టును పూజించడం శుభ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి.
అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోనే పూజ చేసి నగదు పెట్టలో ఉంచుతారు.దీని వల్ల ధన వృద్ధి జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే 10 వ రోజు విజయదశమి రోజు( Vijayadashami ) ఉదయాన్నే నిద్ర లేచి, తల స్నానాలు చేసి, నూతన దుస్తులు ధరించి, మామిడి ఆకు పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు.
పిండి వంటలు వండుకొని బంధుమిత్రులతో కలిసి పంచుకుంటారు.సాయంత్రం కాలం అమ్మవారికి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకును ఒకరికొకరు పంచుకుంటారు.ఇలా ఆ రోజు ఎంతో ఆనందంగా కుటుంబం అంతా కలిసి ఈ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది.కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే రావణాసురుని వధకి గుర్తుగా ఆనంద ఉత్సవాలతో రావణుడి ( Ravana )దిష్టి బొమ్మను దహనం చేయడం, పటాకులు వంటివి కాల్చి సంబరాలు కూడా చేసుకుంటారని పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU