ప్రభాస్‌ వాటికి నో చెప్పి ఇప్పటి వరకు రూ.50 కోట్లు వదిలేశాడు

టాలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. మహేష్‌ బాబు ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయలను డైరెక్ట్‌ గా ఇండైరెక్ట్‌ గా బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్ల దక్కించుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

 Prabhas Reject Rs 50 Crores,latest Tollywood News,viral-TeluguStop.com

ఇంకా చాలా మంది స్టార్స్ కూడా తమ క్రేజ్ కు తగ్గట్లుగా యాడ్స్ చేసి కోట్ల రూపాయలను దక్కించుకుంటున్నారు.కాని పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్స్ మాత్రం బ్రాండ్స్ కు అంబాసిడర్స్ గా వ్యవహరించకుండా కోట్ల రూపాయలను వదిలేస్తున్నారు.

ఏదైనా ప్రొడెక్ట్‌ కు ప్రమోషన్ చేయడం అంటే మొదట దాన్ని మనం నమ్మాలి.ఆ తర్వాతే దాన్ని ప్రమోట్ చేయాలని కొంత మంది అనుకుంటే ఏది అయితే మనుకు ఏంటీ ప్రమోషన్ చేయడం అవసరమా అనుకునే బ్యాచ్ ప్రభాస్‌ ఈయన తన చేతి వద్దకు వచ్చిన ఎన్నో కమర్షియల్స్ ను వదిలేశాడు.

ప్రభాస్‌ కమర్షియల్‌ గా ఆలోచించే రకం కాదు.అందుకే ఆయన రెండేళ్ల కాలంలో ఏకంగా 50 కోట్ల రూపాయలను యాడ్స్ చేసేందుకు నిరాకరించి కోల్పోయాడు అంటూ టాక్ వస్తుంది.

అప్పట్లో మహీంద్రా ఎస్‌ యూ వీ కోసం నటించిన ప్రభాస్ మళ్లీ ఎప్పుడు కూడా ప్రమోట్‌ చేసే పని పెట్టుకోలేదు.ఆయన నటించేందుకు సిద్దంగా ఉంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్రాండ్స్‌ ఆయన ఖాతాలో పడేవి.సౌత్‌ లో అత్యధికంగా యాడ్స్‌ చేసే జాబితాలో ప్రభాస్ నెం.1 గా ఉండే వాడు.పాన్ ఇండియా గుర్తింపు ఉన్న హీరో కనుక పారితోషికం విషయంలో ప్రభాస్‌ కంటే అధికంగా ఉండేది.అయినా కూడా ప్రభాస్‌ మాత్రం కమర్షియల్స్‌ కు నో చెబుతూ వచ్చాడు.

ఇప్పటికే ఆయన నో చెప్పిన కమర్షియల్స్ విలువ 50 కోట్లు ఉంటే ఆయన వద్దకు రాకుండా ఆగిపోయిన కమర్షియల్స్ కూడా చాలా ఉన్నాయి.అంటే మొత్తంగా వంద కోట్ల వరకు ప్రభాస్‌ కోల్పోయినట్లే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube