దేశంలోకి కరోనా మహమ్మారి వచ్చి లక్షల కుటుంబాలను అనాధలుగా, బికారుల్లా మార్చేయగా, కొందరికి మాత్రం మేలు చేస్తుందని చెప్పవచ్చూ.ఈ కరోనా సమయంలో ఆస్తులు కూడ బెట్టుకుంటున్న వారున్నారు.
సర్వం కోల్పోయి అనాధలుగా మారిన వారున్నారు.
ఇక ముఖ్యంగా నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో కొందరిని విడుదల కూడా చేశారట.
అయితే కరోనా నేపధ్యంలో నేరం చేసిన నేరస్తుల విషయంలో సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఒక కేసుకు సంబంధించిన విచారణలో యూపీ ప్రభుత్వ పిటిషన్ పై స్పందించిన సుప్రీం ధర్మాసనం నిందితుడి నేర చరిత్ర ఆధారంగానే బెయిల్ మంజూరు చేయాలని, కానీ కేవలం కరోనా భయాల కారణంగా బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది.
దీనికి కారణం నేరస్తులతో నిండిపోయిన జైళ్లల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుందని, అందుకే వీరికి ముందస్తూ బేయిల్ ఇవ్వాలని అలహాబాద్ హైకోర్ట్ అభిప్రాయపడగా, ఈ తీర్పుపై యూపీ ప్రభుత్వం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ నేపధ్యంలో సుప్రీం కోర్ట్ పై విధంగా పేర్కొంది.