దేశంలో కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్న రాష్ట్రాలలో.తమిళనాడు కూడా ఉందన్న సంగతి తెలిసిందే.
రోజు రోజుకి కేసులు పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధాని మోడీ కి ఆక్సిజన్ కొరత విషయంలో లెటర్ రాయడం జరిగింది.ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో రావటానికి కారణం ఎలక్షన్ కమిషన్ అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
సెకండ్ వేవ్ రాష్ట్రంలో ఇంటర్ అవ్వటానికి కారణం ఎన్నికల కమిషన్ యే కారణమని స్పష్టం చేసింది.
దీంతో ఎన్నికల అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదు అన్నట్టు ప్రశ్నించడం జరిగింది.
బహిరంగ సభలు, ర్యాలీలు, ఎందుకు ఆపలేదు అని ఎన్నికల కమిషన్ ని కడిగి పారేసింది. ఈ తరుణంలో ఎన్నికల కౌంటింగ్ విషయంలో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారో బ్లూప్రింట్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరింది.
మే 2న జరిగే లెక్కింపు కార్యక్రమం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.లేదంటే ఎన్నికలను రద్దు చేస్తామని మద్రాస్ హైకోర్టు ఈసీకి హెచ్చరికలు జారీ చేసింది.