ఎన్నికలు ఉండటంతో ముందుగానే పరీక్షలు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రెస్ మీట్…* ఈ ఏడాది 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించబోతున్నాం…సాధారణ ఎన్నికల ముందే పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం…6 లక్షల మంది 10 వ తరగతి, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు( intermediate) పరీక్షలకు హాజరవుతారు…
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష సమయం ఉంటుంది… ఒక రోజు కేవలం ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది…ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు.థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తాము.
మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.