తెలుగుదేశానికి ఇక అన్ని శుభశకునాలే?

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత మరియు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి .ఈనెల 28 వరకు మధ్యంతర బెల్ లో ఉన్న షరతులు వర్తిస్తాయని 29 తర్వాత రాజకీయపరమైన సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అంటూ ఏపీ హైకోర్టు( AP High Court ) అనుమతినిచ్చింది.

 Are All Good Omens For Telugu , Chandrababu Naidu, Ap High Court, Siemens Dire-TeluguStop.com

ఈ కేసులో విచారణ మొదలైన 22 నెలల వరకూ చంద్రబాబు బయటే ఉన్నారని, ఆ సమయంలో సాక్షులను ప్రభావితం చేశారు అనడానికి ప్రాదమికఆధారాలు లేవు అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Telugu Ap, Omens Telugu, Chandrababu, Design Tech, Siemens-Telugu Political News

అంతేకాకుండా అత్యున్నత భద్రత మధ్య ఉన్న చంద్రబాబు కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేదని కూడా హైకోర్టు అభిప్రాయపడింది . సిమెన్స్ డైరెక్టర్ మరియు డిజైన్ టెక్ యజమాని ( Siemens Director and Owner of Design Tech )వాట్సాప్ చాట్ లకు చంద్రబాబుకి సంబంధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.దాంతో గ్రహణం వీడిన చంద్రుడిలా తమ నేత చంద్రబాబు బయటకు వచ్చినట్లయ్యింది అని టిడిపి( TDP ) శ్రేణులు సంభరాలు చేసుకుంటున్నాయి .నిజానికి ఎన్నికలు దగ్గరకు వచ్చిన ఈ ప్రస్తుత తరుణంలో ఈ ఆరు నెలల కాలం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు అత్యంత అమూల్యమైనది ఎన్నికల సన్నద్ధతకు,ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ రూపొందించుకోవాల్సిన సమయం, పైగా జనసేనతో పొత్తును కూడా ప్రకటించి ఉండడంతో సీట్ల సర్దుబాటు, అసంతృప్తులను బుజ్జగించడం వంటి కీలకమైన దశను ఆ పార్టీ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

Telugu Ap, Omens Telugu, Chandrababu, Design Tech, Siemens-Telugu Political News

ఇలాంటి కీలక సమయంలో చంద్రబాబు జైలులోనే ఉండి ఉంటే ఆ పార్టీకి నిర్వహణ చాలా కష్టమై ఉండేది.అందువల్ల ఇప్పుడు దొరికిన బెయిల్ ఆ పార్టీకి ఆక్సిజన్ లాంటిదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.సరైన సమయంలో చంద్రబాబు విడుదలవడంతో ఇక పూర్తిస్థాయిలో రాజకీయ వ్యవహారాలను నడిపిస్తారని, వాయువేగంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది .మరి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిన తర్వాత దొరికిన ఈ సమయాన్ని రెట్టింపు పట్టుదలతో చంద్రబాబు ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube