ఎండల వల్ల చేతులు నల్లగా మారాయా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!

అసలే వేసవి కాలం.( Summer ) ఎంత ఖరీదైన సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పటికీ ఈ ఎండల్లో తిరిగితే దెబ్బకు చర్మం టాన్ అయిపోతుంటుంది.

 Best Remedy For Lighten Your Dark Hands Details! Home Remedy, Dark Hands, Latest-TeluguStop.com

అయితే చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేసుకుంటారు.కానీ చేతులు మాత్రం మర్చిపోతుంటారు.

దాంతో చేతులు బాడీ తో సంబంధం లేకుండా ఎండల దెబ్బకు నల్లగా ( Dark Hands ) మారిపోతుంటాయి.అలాంటి సమయంలో చేతులను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే డోంట్ వర్రీ.ఎండల వల్ల నల్లగా మారిన చేతులను రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే సులభంగా చేతులను తెల్లగా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Coffee Powder, Dark, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Sug

ఇప్పుడు ఇందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చక్కని తీసుకుని చేతులను బాగా రుద్దాలి.కనీసం ఐదు నిమిషాల పాటు చేతులను నిమ్మ చెక్కతో రబ్ చేసుకుని ఇప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Coffee Powder, Dark, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Sug

చివరిగా చేతులకు ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ఎండల వల్ల చేతులు ఎంత నల్లగా మారినా సరే మళ్లీ పూర్వ స్థితికి వస్తాయి.చేతులు తెల్లగా కాంతివంతంగా మారతాయి.కాబట్టి ఎండల వల్ల చేతులు నల్లగా మారాయి అని బాధపడుతున్న వారు ఈ రెమెడీని తప్పకుండా పాటించండి.పైగా ఈ రెమెడీ పాదాలు, మెడ, అండర్ ఆర్మ్స్ న‌లుపును వదిలించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube