యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్…. అధికారిక ప్రకటన వెల్లడి!
TeluguStop.com
కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ కే జి ఎఫ్( KGF ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించారు నటుడు యశ్( Yash ) .
ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కే జి ఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా విడుదలయ్యి కూడా దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు హీరో యశ్ నుంచి మరో సినిమా రాకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ఇక యశ్ కాస్త ఆలస్యంగా వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టం అవుతుంది.
ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దశకత్వంలో రాబోతున్న టాక్సిక్( Toxic ) అనే సినిమాలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు.
"""/" /
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ పాత్రలో కనిపించనున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టాక్సిక్ సినిమా ఏప్రిల్ 10వ తేదీ విడుదల కానుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరో నటిస్తున్నారు అనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు.తాజాగా నటుడు అక్షయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాలో నయనతార ( Nayanatara ) భాగం కాబోతున్నారని ఇంతకుమించి తనని ఇంకేమీ అడగద్దు అంటూ తెలియజేశారు.
త్వరలోనే ఈ విషయాలన్నింటి గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది అంటూ అక్షయ్ ఒబెరాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు.
స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!