చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సాధించాడు.ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నాడు అందులో ఒకటే సుజీత్ పవన్ కాంబో…సుజిత డైరెక్షన్ లో వచ్చిన చివరి సినిమా సాహో సినిమా ప్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకి అవకాశం ఇవ్వడాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురి అవుతుంటే మరి కొందరు మాత్రం సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబో పెర్ఫెక్ట్ సెట్ అవుతుంది అంటున్నారు.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది…ఇక ఈ కథ కూడా ఆల్మోస్ట్ లీకైంది అని చెప్తున్నారు.లీకైన కథ ప్రకారం చూస్తే ఈ సినిమా స్టోరీ ఎంటి అంటే ఒక ఏరియా లో ఒక రౌడీ కింద పని వాళ్ళు గా ఉన్న చాలా మందిని విడిపించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసి వాళ్ళని విడిపించి రౌడీలు అందరికీ తానే హెడ్ గా మారి ఒక గ్యాంగ్ స్టర్ లా అందరిని శాసిస్తు ఉంటాడు అలా జరుగుతున్న క్రమం లో ఆయన వర్గం లోనే చాలా మంది శత్రువులు ఉంటారు వాళ్ళు చేసే పనులు నచ్చక వాళ్ళని కొట్టి వెళ్ల గొడతాడు పవన్ కళ్యాణ్ దాంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తారు కథ అయితే చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నప్పటికీ దీని కథనం లో గాని డైరెక్షన్ లో కానీ సుజీత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ పడుతుంది అని ఆయన అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు…