ఇదేందయ్యా ఇది: ఏనుగు ఏంటీ మధ్యలో దూరి ఇలా చేస్తుంది..?!

మధ్యలో దూరింది అంటే ఏమనుకుంటున్నారు?కామన్ గా ఏనుగులు ఏం చేస్తాయి గడ్డి తింటాయి.చెరుకు గడలను నమిలేస్తాయి.

 This Is It: An Elephant Squeezes In The Middle And Does This, Elephant , Viral-TeluguStop.com

అయితే ఏనుగులు పార్క్ లోకి వెళ్లాయంటే మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి లేదా అక్కడ ఉన్న వాళ్లని పరుగులు పెట్టిస్తాయి.కానీ ఈ ఏనుగు అలాంటిది కాదు.

ఈ ఏనుగు అన్నీ ఏనుగుల్లా కాదు కొంచెం డిఫరెంట్, కాస్తా చలాకీ.అందుకే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ లోకి వచ్చి అది కూడా ఆడుకుంటూ అటూ ఇటూ దూరుతూ ఏంజాయ్ చేసింది.

ఈ అరుదైన ఘటన అస్సాంలోని గువాహటిలో వెలుగు చూసింది.

ఇక్కడ నారండీ ఆర్మీ కంటోమంట్ లో ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది.

దాని పక్కనే ఆంచంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఉంది.దానిలో నుంచే ఆ ఏనుగు అక్కడికి వచ్చందని భావిస్తున్నారు.

అయితే అది ఎవరినీ ఏం చేయలేదు.అలా ఆడుకుంటూ కొంత మంది కంట పడింది.

ఇక వాళ్లు కెమెరాలో బంధించడంతో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా, కొన్ని రోజుల క్రితం ఇదే మిలటరీ క్యాంప్ లోకి ఒక ఏనుగు దూసుకొచ్చంది.ఆ సమంలో అక్కడ కొందరు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.ఈ ఏనుగు కూడా ఆంచంగ్ శాంక్చువరీ నుంచే వచ్చంది.వచ్చీ రావడంతో తాను కూడా ఆటలో జాయిన్ అయేందుకు ప్రయత్నించింది.

ఒక వ్యక్తి తన వైపు బంతిని తంతే.

ఇది కూడా రిటర్న్ కిక్ ఇచ్చింది.అనంతరం వెళ్లాస్తా అన్నట్లుగా తొండం పైకెత్తి చూపిస్తూ వెళ్లిపోయింది.

అయితే ఏనుగులు మనుషలును పరుగులు పెట్టించడమే కాదు సాయం కూడా చేస్తాయి.ఇటువంటి చిత్ర విచిత్ర సంఘటనలు ఎన్నో లేకపోలేవు.

ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube