నాపై ట్రోలింగ్స్ చేస్తోంది వాళ్లే.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో మంచు విష్ణు!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఒక వైపు మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూనే మరోవైపు హీరోగా సినిమాలను నటిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా.

 Manchu Vishnu Once Again Reacted On Trollers Manchu Vishnu, Tollywood, Trolls, S-TeluguStop.com

మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాలో సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌, సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

అయితే సినిమా విడుదల తేదీకి కొద్దిరోజులే సమయం ఉండటంతో ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నాడు విష్ణు.

ఈ సందర్భంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ట్రోల్స్‌ పై మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు.తనను కావాలనే టార్గెట్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నట్లు మంచు విష్ణు గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కొందరు డబ్బులిచ్చి మరీ తనను ట్రోల్‌ చేయిస్తున్నారంటూ ఎప్పటినుంచో అంటూనే ఉన్నాడు.

Telugu Maa, Manchu Vishnu, Tollywood, Trolls-Movie

అయితే తనపై ట్రోల్స్‌ చేయిస్తోంది ఎవరో తనకి తెలుసని చెప్పుకొచ్చాడు.ఆ ఒక్కడు ఎవరన్నది ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న వారందరికీ తెలుసు కానీ వాళ్ల పేరు నేను నా నోటితో చెప్పాలను కోవడం లేదు అని తెలిపాడు విష్ణు.నాపై ట్రోల్స్ చేయిస్తున్న వారి పేరును కూడా నా నోటితో చెప్పాలి అని నేను అనుకోవడం లేదు.

అయితే ఇంతక ముందు నా మీద ఎలాంటి ట్రోలింగ్‌ జరగలేదు.నేను ఎప్పుడైతే మా ఎన్నికల్లో పోటీ చేశానో, మా అధ్యక్షుడిగా గెలిచానో అప్పటి నుంచే నాపై ట్రోలింగ్‌ జరగడం స్టార్ట్ అయ్యింది అంటూ తనపై వచ్చే ట్రోలింగ్‌ విషయం గురించి మరోసారి ప్రస్తావించాడు.

అయితే మొత్తానికి తన పై ట్రోలింగ్స్ చేస్తున్నది ఎవరో తెలుసుకున్న మంచి విష్ణు ప్రస్తుతానికి వెల్లడించకపోయినా ముందు ముందుఅయినా వెళ్లాడిస్తారేమో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube