ఒకప్పుడు ఎర్రజెండాలకు అడ్డాగా ఉన్నటువంటి హుస్నాబాద్(Husnabad) ప్రాంతం ఒకప్పుడు ఇందుర్తి నియోజకవర్గంగా ఉండేది.ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు సిపిఐ(CPI) పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తులే విజయం సాధించారు.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంగా మారింది.హుస్నాబాద్ నియోజకవర్గ ఏర్పడినప్పటి నుంచి 2009 నుంచి 2018 వరకు ఒక మారు కాంగ్రెస్(Congress) పార్టీ విజయం సాధించింది.
ఆ తర్వాత రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ విజయం అందుకుంది.అలాంటి హుస్నాబాద్ పొత్తుల్లో భాగంగానే నలిగిపోతూ వస్తోంది.
అయితే ఈసారి కూడా హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ విషయంలో తర్జనభజన జరుగుతోంది.ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒక మారు ఎమ్మెల్యేగా చేసినటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి(Aligireddy Praveen Reddy), కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

రాహుల్ భారత్ జోడోయాత్ర కొనసాగింపుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాదయాత్రతో తన ప్రచారాన్ని మొదలుపెట్టిన ప్రవీణ్ రెడ్డి, 85 గ్రామాలను చుట్టుముట్టారు.దీంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తిగా మారింది.ఇదే తరుణంలో హుస్నాబాద్ సీట్ పై మాజీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కన్ను పడింది.వెంటనే హుస్నాబాద్ నియోజకవర్గానికి మకం మార్చి, నాకు టికెట్టు తనకే కావాలని కొట్లాడుతూ వస్తున్నారు.
ఆయన కూడా హుస్నాబాద్ ఇతర ప్రాంతాలు చుట్టూ ముడుతూ, ఆరు గ్యారెంటీ కార్డులతో ప్రచారం చేస్తున్నారు.ఈ విధంగా హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు కీలక నేతల మధ్య విపరీతమైన ఫైట్ జరుగుతోంది.

కానీ అధిష్టానం మాత్రం ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది ఇంకా టికెట్ విషయం తేల్చకపోవడంతో కార్యకర్తలు ఏ నాయకునితో తిరిగాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.కాంగ్రెస్ నాయకుల విషయం పక్కనపెడితే పొత్తుల్లో భాగంగా చాడ వెంకటరెడ్డి(Chada Venkat Reddy) కూడా హుస్నాబాద్ టికెట్ ని ఆశిస్తున్నారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం సిపిఐతో చర్చలు జరుపుతోంది.ఈ విధంగా హుస్నాబాద్ టికెట్ కోసం ముగ్గురు కీలక నేతల మద్య పోటీ పడుతుండడంతో అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించాలో తెలియక తలలు పట్టుకుంటుందట.
ఒకవేళ కాంగ్రెస్ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్, అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిలను కాదని చాడ వెంకటరెడ్డికి ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.మరి చూడాలి ఇంకో వారంలో హుస్నాబాద్ నుంచి పోటీ చేసేది ఎవరు అనేది క్లారిటీగా తెలుస్తుంది.







