తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( MP Bandi Sanjay ) ఇప్పుడు మాజీ అయ్యారు.ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి( Minister Kishan Reddy ) ఆ బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం ఉండగా బిజెపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది బండి సంజయ్ సారథ్యం లోనే ఎన్నికలకు బిజెపి వెళుతుందని అంతా అంచనా వేసినా, వారి అంచనాలను తారుమారు చేస్తూ కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు.బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించినా, బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరిగింది.
అయితే ఆయనకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు.ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) నోటిఫికేషన్ జారీ చేశారు.
దీని ప్రకారం డీకే అరుణను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగించారు.

బండి సంజయ్ ను తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించినా, కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తారని సంజయ్ అనుచరులు ఆశాభావంతో ఉండగా, ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు.సంజయ్ కు జాతియ స్థాయిలో పదవి దక్కినా, కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కే అవకాశం లేదనే విషయం తేలడంతో సంజయ్ అనుచరులు నిరాశకు గురవుతున్నారు.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే అనేకమంది ఉన్నారు.వారిలో ఒకరిగా మాత్రమే సంజయ్ ఉంటారు.దీంతో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే విషయంపై సంజయ్ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు .అయితే తెలంగాణ విషయంలో సంజయ్ కు ఎటువంటి అధికారాలు ఉంటాయి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేకపోవడంతో, సంజయ్ కు పదవి వచ్చినా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదా అని అనుమానాలు సంజయ్ అనుచరులో కలుగుతున్నాయి.అసలు అకస్మాత్తుగా బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఆయనకు ప్రమోషన్ ఇచ్చారా లేక డిమోషన్ ఇచ్చారా అనేది తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
ఇక సంజయ్ కూడా కొత్త పదవిపై అసంతృప్తితోనే ఉన్నారట.







