ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.పది రోజులుగా కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు.
ఈ మేరకు ఇవాళ కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court _లో హాజరుపరచనున్నారు.
ఈ క్రమంలో కవితను కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది.న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తే తీహార్ జైలుకు తరలించే ఛాన్స్ ఉంది.మరోవైపు కవిత బెయిల్ పిటిషన్( Kavitha Bail Petition ) పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.