కమిట్ మెంట్స్ ఇవ్వడం వల్లే సినిమా అవకాశాలు రావు.. టాలెంట్ కూడా... 

తెలుగులో ఆమధ్య ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రంలో కొంతమేర బోల్డ్ తరహా పాత్రలో నటించి అందాల ఆరబోతతో ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ నటి “మేఘన చౌదరి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి మేఘన చౌదరి సినిమా పరిశ్రమకు వచ్చినప్పటినుంచి ఎక్కువగా బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలో నటించింది.

 Telugu Bold Actress Meghana Chowdary About Commitment Offers In Film Industry, T-TeluguStop.com

దాంతో ఈ అమ్మడికి ఎక్కువగా అలాంటి తరహా పాత్రల్లో నటించే అవకాశాలే వస్తున్నాయి.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న “మేఘన చౌదరి” సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంపై స్పందించింది.

ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో కేవలం కమిట్మెంట్లు ఇవ్వడం వల్లే అవకాశాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఖచ్చితంగా టాలెంట్ ఉంటేనే ఎప్పటికైనా మంచి నటిగా లేదా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.అయితే తాను ఇప్పటివరకు ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని అందువల్లనే సరైన గుర్తింపు రాకపోయినప్పటికీ ఏదో ఒకరోజు నటిగా సక్సెస్ అవుతానని ధీమా వ్యక్తం చేసింది.

అలాగే అడ్డదారుల్లో సంపాదించే అవకాశాలు ఎంతోకాలం ఉండవని మనలో నటన ప్రతిభ లేకపోతే సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం కూడా మనుగడ సాగించలేమని కూడా తెలిపింది.

కానీ తాను ఇప్పటివరకు బోల్డ్ మరియు ఎక్స్ పోజింగ్ తరహా పాత్రలో నటించడంతో కొంతమంది దర్శక నిర్మాతలు తాను కేవలం అలాంటి పాత్రలకు సూటవుతానని అనుకుంటున్నారని, కానీ నటనకు స్కోప్ ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా తన ప్రతిభను నిరూపించుకుంటానని మేఘన చౌదరి చెప్పుకొచ్చింది.

ఇక తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగువాళ్ళకి అవకాశాలు ఉండవనే విషయంపై స్పందిస్తూ చాలా మంది తెలుగు నటీనటులు బోల్డ్ మరియు ఎక్స్ పోజింగ్ తరహాలో పాత్రలో నటించడానికి సంకోచిస్తారని అంతేకాకుండా తాము ఇలాంటి పాత్రల్లోనే నటించాలని నియమ నిబంధనలు కూడా పాటిస్తారని ఈ క్రమంలో చాలా మందికి తాము అనుకున్న పాత్రలు దొరకవని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.కానీ సినిమా పరిశ్రమలో నటిగా కొనసాగాలంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి మేఘన చౌదరి తెలుగులో ఏడు చేపల కథ, నగ్నం, అలాగే మరిన్ని చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

అందువల్లనే నటి మేఘన చౌదరికి నటనా ప్రతిభ ఉన్నప్పటికీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube