అన్ స్టాపబుల్ లో నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేసిన గోపీచంద్!

మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.

 Gopichand Reveals The Title Of His Next Movie Details, Gopichand, Gopichand30 Mo-TeluguStop.com

ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.తన లాస్ట్ సినిమా పక్కా కమర్షియల్.

గోపీచంద్ సీటిమార్ సినిమా హిట్ తర్వాత మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ చేసాడు.

కానీ సీటిమార్ తో హిట్ అందుకున్న ఈయన పక్కా కమర్షియల్ తో యావరేజ్ సినిమా అనిపించు కున్నాడు.

ప్రెజెంట్ గోపీచంద్ లక్ష్యం హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో మరో సినిమా చేస్తున్నాడు.ఈసారి కూడా మరో హిట్ ఇస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

ఇక ఇటీవలే దసరా పండుగ సందర్భంగా శ్రీను వైట్లతో మరో సినిమా ప్రకటించాడు.అయితే తాజాగా శ్రీవాస్ తో చేస్తున్న సినిమా టైటిల్ ను గోపీచంద్ రివీల్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

అది కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో.

అసలు విషయం ఏంటంటే.

బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా ప్రభాస్ రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే.

మరి ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ కూడా ఈ షోలో సందడి చేయడానికి సిద్ధం అయ్యాడు.ఈ శుక్రవారం రాబోతున్న ఈ ఎపిసోడ్ లో వీరిద్దరూ స్నేహితులు ప్రేక్షకులను అలరించాడు.మరి ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ తన సినిమా టైటిల్ ను రివీల్ చేసినట్టు టాక్.

ప్రెజెంట్ గోపీచంద్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”రామబాణం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం.మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా జగపతిబాబు కూడా కీలక రోల్ లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube