దేవర3 గురించి కొరటాల శివ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారుగా.. అలా చెప్పడంతో?

దేవర మూవీని( Devara ) మొదట కొరటాల శివ( Koratala Siva ) ఒకే భాగంగా తెరకెక్కించాలని అనుకున్నారు.అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ప్రస్తుతం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.

 Here Is The Clarity About Devara Sequel Details, Devara Movie, Devara Sequel, Jr-TeluguStop.com

దేవర సీక్వెల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా దేవర3( Devara 3 ) కూడా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.దేవర ఫ్రాంఛైజీ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారం ఎక్కువ కావడంతో దేవర3 గురించి కొరటాల శివ వైపు నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది.దేవర సినిమాను ఫ్రాంఛైజీగా మార్చాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన తెలిపారు.

నా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల కథను ఎక్కువగా ఒక భాగంలో చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చానని కొరటాల శివ కామెంట్లు చేశారు.దేవర సినిమాలో వచ్చే కీలక పాత్రల వల్ల సెకండ్ పార్ట్ దిశగా అడుగులు వేశామని ఆయన తెలిపారు.

Telugu Devara, Devara Sequel, Koratala Siva, Janhvi Kapoor, Jr Ntr, Ntr Devara,

సీక్వెల్ కు సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ ఇప్పటికే పూర్తైందని ఆయన పేర్కొన్నారు.మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కొరటాల శివ కామెంట్లు చేశారు.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలు పూర్తయ్యాకే దేవర2( Devara 2 ) గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.

Telugu Devara, Devara Sequel, Koratala Siva, Janhvi Kapoor, Jr Ntr, Ntr Devara,

దేవర2 న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుందని కొరటాల శివ చెబుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.దేవర సీక్వెల్ కోసం ఫ్యాన్స్ లో నిదానంగా అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.దేవర2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ సైతం వీలైనంత వేగంగా దేవర సీక్వెల్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube