ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.చంటి పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇలా ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్‌లే దర్శనమిస్తున్నాయి.
అసలు ఫోన్ లేనిదే చాలా మంది బయట కాలు కూడా పెట్టడానికి ఇష్టపడటం లేదు.అంతలా ఫోన్లకు అలవాటు పడిపోయారు.
కొందరైతే వాటికి బానిసలుగా కూడా మారుతున్నారు.ఇలాంటి వారు తిండి, నిద్ర, ఫ్యామిలీ వంటి వాటినేమి కూడా పట్టించుకోకుండాఎప్పుడు ఫోన్లతోనే సమయాన్ని మొత్తం గడుపుతుంటారు.
ఈ క్రమంలోనే వివిధ రకాల జబ్బుల బారిన పడుతుంటారు.అక్కడి వరకు వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ సూపర్‌గా సహాయపడతాయి.మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ఫోన్‌ను వినియోగించాలని మీకు అనిపిస్తున్నప్పుడు వెంటనే వేరే పనిపై మనసును మల్లించండి.వంట చేయడం, ఇంట్రస్టింగ్ గా ఉండే బుక్స్ ను చదవడం, ఫ్యామిలీతో కూర్చుని కబుర్లు చెప్పడం, సరదాగా ఆటలు ఆడటం, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం వంటివి చేయాలి అలాగే ఫోన్‌ను వాడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో.
పదే పదే మైండ్‌కు తెలియజేస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల ఫోన్‌ను చూడాలనే ఆసక్తి తగ్గుతుంది.

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను పొరపాటున కూడా దగ్గర పెట్టుకోరాదు.ఇలా చేస్తే నిద్ర ముంచుకొస్తున్నా ఫోన్‌నే వాడాలని మనసు లాగేస్తుంది.అందుకే ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టండి.వారానికి ఒకసారి భోజనం చేయకుండా ఫాస్టింగ్ చేస్తుంటారు.అలాగే ఫోన్ ఫాస్టింగ్ చేయండి.అంటే వారానికి ఒకరోజు ఫోన్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఇక ఖాళీ సమయాన్ని ఫోన్లకే అంకితం చేస్తుంటారు.
కానీ, ఖాళీగా ఉన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ వంటి వాటిపై మనసును మల్లిస్తే ఫోన్‌కు దూరంగా ఉండవచ్చు.