రాజన్న సిరిసిల్ల జిల్లా: దేశంలో బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, అలాంటి బిజెపి నుండి ప్రజలను, దేశ సమగ్రతను కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ ( Congress party )మాత్రమేనని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు( Karimnagar MP Candidate Velichala Rajender Rao ) పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట్, ముస్తాబాద్, తంగళ్ళపల్లి మండల కేంద్రాల్లో రాజేందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాను కేకే మహేందర్ రెడ్డి కలిసి నాలుగేళ్ల పాటు టిఆర్ఎస్ లో కొనసాగామని, ఆ సమయంలో ఖర్చుల నిమిత్తం తమ వద్ద నుండే కెసిఆర్ కుటుంబం డబ్బులు అడిగేదని తెలిపారు.అలాంటిది ఇప్పుడు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
తనలాగే కేకే నయవంచనకు గురిచేసి మోసం చేసిందని ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే తెలంగాణ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ, అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు, నిరుద్యోగ భృతి( Nirudyoga Bruthi ) కింద నిరుద్యోగులకు 2500 రూపాయలు ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో అధికారంలో రాగానే 18% గా ఉన్న జీఎస్టీ ని 12 శాతానికి కుడించి నిత్యవసరాలు ధరలు సామాన్యులకు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు.బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కాలేశ్వరం సబ్ కాంట్రాక్ట్ అక్రమ నిధులతో హోటల్ ప్రతి మాలో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారని, ఆ డబ్బుతో కరీంనగర్ ప్రజలను మోసం చేసి కోట్లు దండుకోవాలని చూశారని విమర్శించారు.ఇక బండి సంజయ్ విషయానికి వస్తే చదువు సంధ్యాలేని దద్దమ్మని ఎద్దేవా చేశారు.20 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులను మురగపెట్టిన సన్నాసి బండి సంజయ్ అని, ప్రసాద్ పథకం ద్వారా గుడుల అభివృద్ధికి నిధులు తెచ్చే అవకాశం ఉన్న భక్తుడినని చెప్పుకునే బండి సంజయ్ నియోజకవర్గంలోని ఏ ఒక్క ఆలయానికి ఒక రూపాయి కూడా ఎందుకు తెలియదని ప్రశ్నించారు.
స్థానికంగా అధికారంలో లేని ప్రాంతాల్లో ముఖ్యంగా భద్రాచలం, రామప్ప, జోగులాంబ ఆలయాలకు ఒక్కో ఆలయానికి 100 కోట్ల నిధులు కేటాయించిన బిజెపి, స్థానిక ఎంపీగా ఉన్న బండి సంజయ్ ( Bandi Sanjay )కు ఎందుకు కేటాయించలేదు గ్రహించాలని సూచించారు.ఇలా అక్రమాలకు పాల్పడిన వారిని తిరిగి గెలిపించుకుంటే జనాల రక్తాన్ని పీల్చి పిప్పిని చేస్తారని, చిన్న రిమార్కు కూడా లేని తనకు ఒక అవకాశం ఇస్తే కరీంనగర్ ను కోహినూర్ల మారుస్తానని హామీ ఇచ్చారు.
తన తండ్రి ఆశయ సాధన మేరకు ఎంపీగా బయలుదేరుతున్న తాను చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల నుండి బిఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు పలు కుటుంబాలు మంత్రి పొన్నం, ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకున్నాయి.
ఈ కార్యక్రమంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఇతర ముఖ్య నేతలు,కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.