రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిగుర్తు కి ఓటువేసి వెలిచాల రాజేందర్ రావు ని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ 2004-14 మధ్య వైఎస్ఆర్ హయంలో ప్రతి ఒక్క హామీ అమలు చేశామన్నారు.ఉచిత విద్యుత్,ఉపాధి హామీ, ఆరోగ్య శ్రీ ,ఫీజు రీయింబర్స్మెంట్ ఇట్లా ఎన్నో పథకాలు అమలు చేశామని, రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ఉద్యోగాల కల్పన , తెలంగాణ అభివృద్ధి కాకుండా వ్యక్తిగత అభివృద్ధి కి బిఆర్ఎస్ ఉపయోగించుకుందన్నారు.
కేటీఆర్ 2009 నుండి ఇక్కడ ఎమ్మెల్యే గా ఉన్నారు.
ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారు.15 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉండి కనీస అవసరాలు ఎందుకు తీర్చలేదు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హమి మేరకు 48 గంటల్లోనే అమలు చేశాం.నా తెలంగాణ అక్కా , చెళ్ళలకు , మహిళలకు ఆర్టీసిలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని,1200 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ నీ.500 కి గ్యాస్ అందిస్తున్నామని,గృహ జ్యోతి కింద జీరో బిల్లు ఇచ్చి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, గతంలో 600 పైగా బిల్లు వచ్చేది ఇప్పుడు ఉచితంగా ప్రతి ఇంట్లో వినియోగించుకుంటున్నారన్నారు.గత ప్రభుత్వం 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదు.మేము రేషన్ కార్డులు ఇస్తాం.మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2500 ఆర్థిక సహాయం చేస్తాం.
మహిళలకు 4000 పెన్షన్ ఇస్తాం.
ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని,బిఆర్ఎస్ ,బీజేపీ వాళ్లు వస్తె మీ హామీలు ఏమయ్యాయి అని నిలదీయండి.బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.15 లక్షల ప్రతి ఒకరి ఖాతాలో వేస్తామన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.
ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు.ఇందిరమ్మ ,రాజీవ్ గాంధీ లు దేశం కోసం ప్రాణాలు అర్పించారు .వారి నాయకత్వంలో సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ఉన్నారు.మాకు తోడుగా ఎంపి నీ గెలిపించండి.
మరింత అభివృద్ధి సాధించవచ్చు.నేను హుస్నాబాద్ ఎమ్మెల్యే, ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే గా గెలిచాం.
వెలిచాల రాజేందర్ రావు ని ఎంపిగా గెలిపించండి .బీజేపీ ఆఫీస్ నుండి ఫోన్లు వస్తె బండి సంజయ్ కి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు నిలదీస్తున్నారు.గుళ్ళో ఉండాల్సిన దేవుడిని.గుండెల్లో ఉండాల్సిన భక్తుని.తపాలల్లో…దేవుడి ఫోటో పెట్టుకొని వస్తున్నారు.
దేవుడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావాలి.రాజేందర్ రావు ని గెలిపించండి.కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు .30 సంవత్సరాల తరువాత బీజేపీ కి మెజారిటీ ఇచ్చింది.మరి హిందువులకు ఏం చేశారు.ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నారు.రిజర్వేషన్లు తొలగించి అదానీ అంబానీ ల పాలన తేవడానికి,దేశానికి నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పాలి.ముస్తాబాద్ బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్న దెబ్బలు తిన్నది మిరు జైల్లోకి వెళ్ళింది మీరు…కానీ 10 మంది మాత్రమే కోటీశ్వరులు అయ్యారు.
బిఆర్ఎస్ ,బీజేపీ లకు ఓటు అడిగే హక్కు లేదు.గ్రామాల్లో వారిని నిలదీయండి.
ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది .ఎవరి బూత్ లలో వారు మెజారిటీ తెచ్చుకోవాలి.మే 13 వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలి.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ముస్తాబాద్ నుండి అత్యధిక మెజారిటీ అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.