కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!

నల్లగొండ జిల్లా: మూఢాలు,ఆషాఢం( Ashada Masam ) కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు,పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని చెప్పేస్తున్నారు.చిరు వ్యాపారుల ఉపాధికి గండి,తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ సేల్స్.

 Break For The Marriages Prospective Newlyweds...three Months Are Like No Muhurta-TeluguStop.com

సాధారణంగా ఎండా కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుం టాయి.కానీ,ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది.

వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ,జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు.

దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యం కాదని తెలియజేస్తున్నారు.

సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి,శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు.

ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది.

అలాగే గురు పౌఢ్యమి(Guru Moudyami ) మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగ నుంది.గురు,శుక్ర మూఢా ల్లో నూతన శుభకార్యక్ర మాలు చేయడం మంచిదికాదని పండితులు సూచిస్తున్నారు.

ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.మూఢాలు,ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు,పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపనుంది.

వారి వ్యాపారం మందగించనుంది.అలాగే బాజాభజంత్రీలు,డప్పు వాయిద్యాలు,డీజేలు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది.

నూతన వస్త్రాలు,బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube