వైజయంతి మూవీస్…… తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి మూవీస్.వైజయంతి మూవీస్ ని స్థాపించింది అశ్విని దత్ చలసాని.
ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన అశ్విని దత్ సినిమా ప్రొడక్షన్ చేయాలని భావించి మొదట ఓ సీత కథ అని చిత్రంతో తన సినిమా కెరియర్ ను ప్రారంభించారు.ఆ తర్వాత అన్నగారు ఎన్టీఆర్ తన చేతుల మీదుగానే వైజయంతి మూవీస్ అనే ప్రొడక్షన్ కంపెనీకి నామకరణం చేశారు.
అలాగే శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటోనే ఈ సినిమా ప్రొడక్షన్ కంపెనీకి లోగో గా కూడా ఉంటుంది.అంత అభిమానం ఎన్టీఆర్ అంటే అశ్విని దత్ కి.తారక్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్ వంటి హీరోలను వైజయంతి మూవీస్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
అలా ఎదురులేని మనిషి సినిమాతో మొదలైన వైజయంతి మూవీస్ ప్రస్థానం దాదాపు 30 సినిమాల వరకు సాగింది.
సినిమా తప్ప మరొక ప్రపంచం లేని అశ్విని దత్ కొన్నేళ్లపాటు అంటే దాదాపుగా ఒక పాతిక సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా సినిమాలు తీస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్లారు.కానీ ఇటీవల కాలంలో మెల్లగా సినిమాలు తగ్గిపోతూ వచ్చాయి.
ఒక దశలో అసలు సినిమాలే తీయకూడదని, వైజయంతి మూవీస్ ని మూసేయాలని అశ్విని దత్ భావించారు.కాని ఆయన కుమార్తెలు కొండంత అండగా ఉంటూ తండ్రిని గెలిపిస్తూ వస్తున్నారు.
అశ్విని దత్ కి ముగ్గురు కుమార్తెలు.మొదటి ఇద్దరు కుమార్తెలు కూడా సినిమా ఇండస్ట్రీలో తండ్రికి వారసురాల్లుగా ఎంట్రీ ఇచ్చారు.
తండ్రి లాగానే సినిమా నిర్మాణం చేపడుతూ తండ్రిని మించిన తనయలుగా పేరు సంపాదించుకుంటున్నారు.
అశ్విని దత్ పెద్ద కుమార్తె స్వప్న తన పేరు పైనే స్వప్న సినిమాస్ అనే సంస్థ స్థాపించి సక్సెస్ఫుల్ గా ఇప్పటికే ఐదు సినిమాలని ప్రొడ్యూస్ చేసింది.ఇక రెండవ కుమార్తె ప్రియాంక కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త్రీ ఏంజిల్స్ స్టూడియో స్థాపించి మూడు సినిమాలు నిర్మాణం చేసింది.ఇక ప్రియాంక భర్త నాగ్ అశ్విన్ దర్శకుడు కావడంతో మహానటి అనే సినిమాను స్వప్న, ప్రియాంకలు కలిసి నిర్మించి అద్భుతమైన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
అలా తండ్రిని మించి సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ లో వైజయంతి మూవీస్ పేరు ముందుకు తీసుకెళ్తున్నారు.