ఆస్తమా ఉన్నవారు ఈ పదార్థాలను తీసుకుంటే మంచిదా..

ప్రస్తుతం కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది.అందువల్ల అస్తమా సమస్య ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 Is It Good For People With Asthma To Take These Ingredients , Asthma, Health , H-TeluguStop.com

చలికాలంలో హస్తమా ఉన్న వారికి ఇంకా ఆస్తమా పెరిగే అవకాశం ఉంది.ఆస్తమా వ్యాధి ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.

ఆస్తమా వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కనిపిస్తోంది.అస్తమా వచ్చిన వారిలో దగ్గు ఎక్కువగా ఉంటుంది.

ఆస్తమా రావడానికి వాతావరణ కాలుష్యం కూడా కారణం.అస్తమా వచ్చిన వారు కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఆస్తమ అదుపులో ఉంచుకోవచ్చు.

ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.నారింజ పండ్లలో విటమిన్ సి, విటమిన్ b6 అధిక పరిమాణంలో ఉండడం వల్ల ఆస్తమా ఉన్నవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పరిమాణాలు ఉత్పత్తుల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటికి పంపిస్తాయి.ఆస్తమా ఉన్నవారు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది .ఆస్తమా వ్యాధి వారు ప్రతి రోజు పాలు, గుడ్లు, చేపలు వంటివి తీసుకుంటూ ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.దానిమ్మ పండ్లను ఉదయం పూట తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

అంతేకాకుండా దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తాయి.ఆస్తమా వ్యాధిగ్రస్తులకు మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, బ్రకోలి, పచ్చి బఠానీలు, మొలకలు, బ్రౌన్ రైస్, ఓట్స్ తీసుకుంటే మంచిది.

ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవడానికి ఆపిల్ తినడం కూడా ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube