క్రిటికల్ గా మారిన శరత్ బాబు ఆరోగ్యం...

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు( Sharat Babu ) ఆరోగ్య ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే మారింది.మూడు రోజుల ముందు ఆయ‌న్ని హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్లో ( AIG Hospitals, Hyderabad )జాయిన్ చేశారు.

 Sarath Babus Health Has Become Critical , Sharath Babu , Sarath Babu Health , Ai-TeluguStop.com

అయితే శ‌నివారం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఐసీయూలో నుంచి నార్మ‌ల్ వార్డుకి మార్చామ‌ని డాక్ట‌ర్స్ తెలిపారు.అయితే మ‌ళ్లీ ఆదివారం ఆయ‌న హెల్త్ కండీష‌న్ సీరియ‌స్‌గా మారింది.

దీంతో ఆయ‌న్ని ఐసీయూ వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా శ‌ర‌రీంలో ప్ర‌ధాన అవ‌య‌వాలైన కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైన‌ట్లు స‌మాచారం.

 Sarath Babus Health Has Become Critical , Sharath Babu , Sarath Babu Health , AI-TeluguStop.com

ఇక సోమవారం కూడా అయన ఆరోగ్య పరిస్థితి అలానే ఉంది .కొన్ని గంట‌ల‌కు గ‌డిస్తే కానీ, చెప్ప‌లేమ‌ని డాక్టర్స్ అంటున్నారు… ప్రస్తుతం శరత్ బాబు వయసు 72 ఏళ్ళు .వయసు మీద పడటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది బడుతున్నారు.

-Movie

ఈ నేపథ్యంలోనే తాజాగా శరత్ బాబు హెల్త్ కండీషన్( Sarath Babu Health Condition ) గురించి వైద్యులు అప్డేట్ ఇచ్చారు.శరత్‌బాబు పరిస్థితి ఇంకా విషమం గానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు .ఇక శరత్ బాబు 250కిపైగా సినిమాల్లో నటించారు.హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం.

తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు.ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు.

తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

-Movie

చివరిగా వకీల్‌సాబ్‌ సినిమాలో కనిపించారు.ఓ పక్క మూవీస్‌లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారు.అనేక తెలుగు, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు.

ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్‌లో కలవరాన్ని నింపింది.ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన కోరుకోవాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.పలువురు సినీ ప్రముఖులు అయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube