అతన్ని వంద శాతం ప్రేమించాను.. వందశాతం మర్చిపోయాను: సుస్మిత సేన్

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు చాలా వరకు తమ వ్యక్తిగత విషయంలో పొరపాట్లు చేస్తుంటారు.ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు.

 Loved Him One Hundred Percent And Forgot Him Sushmitha Sen Details, Sushmita Se-TeluguStop.com

ఇలాంటి విషయాల్లోనే సెలబ్రెటీలు ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.ఇప్పటికే చాలామంది సెలబ్రేటిలు తమ వ్యక్తిగత విషయాలలో బాగా వార్తల్లోక్కెక్కారు.

అలా నటి సుష్మితా సేన్ కూడా వ్యక్తిగత విషయం లో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ గురించి అందరికీ పరిచయమే.

ఈమె తన అందంతో విశ్వసుందరిగా పేరు సంపాదించుకుంది.కేవలం హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు సినిమాలలో కూడా నటించింది.

ఇక తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సుష్మితా సేన్ తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి 1996లో దస్తక్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకువెళ్ళింది.ఇక 20l5 లో నిర్భాక్ అనే సినిమాలో చివరిసారిగా నటించగా.

ఆ మధ్య పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.ఇక ఇప్పటికీ అంతే అందంతో వెలిగిపోతుంది సుష్మిత.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన గ్రామర్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.

Telugu Bollywood, Loved, Universe, Rohman Pal, Siushmithasen, Sushmita Sen, Sush

ఇదిలా ఉంటే గతంలో ఈమె ప్రముఖ మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే.నిజానికి అతడు సుష్మితా సేన్ కంటే చిన్నవాడు.అయినా కూడా వీరిద్దరూ ప్రేమలో పడటం తో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచారు.ఇక గతంలో వీరిద్దరూ కలిసి బాగా తిరిగారు.చాలా సార్లు మీడియా కంటికి కూడా చిక్కారు.అయినా కూడా వీళ్ళు ఎవర్నీ పట్టించుకోకుండా బాగా తిరిగారు.

Telugu Bollywood, Loved, Universe, Rohman Pal, Siushmithasen, Sushmita Sen, Sush

గతంలో రోహ్మన్ కూడా చాలాసార్లు సుష్మిత గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.ఏదైనా ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తన గురించి ఖచ్చితంగా మాట్లాడేవాడు.తమకు పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురైనప్పుడు ఏ రోజు కూడా పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇవ్వలేదు.కానీ కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కూడా.

Telugu Bollywood, Loved, Universe, Rohman Pal, Siushmithasen, Sushmita Sen, Sush

వీరిద్దరి విడిపోవడానికి కారణాలు ఏంటో ఇప్పటి వరకు తెలియలేదు.తాజాగా సుష్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయినందుకు కొన్ని విషయాలు తెలిపింది.తను ప్రేమలో ఉన్నప్పుడు 100% ప్రేమిస్తాను అని అలాగే విడిపోతే కూడా 100% విడిపోవాలని భావిస్తానని తెలిపింది.

కారణమేదైనా జీవితం ఓ వలయంలో చిక్కుకు పోవటానికి మాత్రం వీల్లేదని తెలిపింది.

ఇద్దరు వ్యక్తులు ముందుకు సాగాలంటే కొన్ని కొన్ని సార్లు ముగింపు కూడా తోడు అవుతుందని తెలిపింది.

ఇక ఆమె ఆర్య సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక వచ్చే ఏడాది సీజన్3 తో ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube