తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..!

తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ మేరకు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

 Counting Of Votes For Teacher Mlc In Telangana..!-TeluguStop.com

ఈ క్రమంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.ఇప్పటివరకు బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో దాదాపు రెండు వేలకు పైగా చెల్లని ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది.దీంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

మొత్తం 28 టేబుల్స్ పై లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా అధికారులు ఇందుకు సంబంధించి వివరాలు ప్రకటించనున్నారు.మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే.

రిటర్నింగ్ అధికారి నుంచి కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డిలు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube