సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వారు ఎవ్వరూ లేరు, అయినాసరే నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగు వేశాడు.స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ నంబర్.1 హీరోగా పేరు సంపాదించుకున్నాడు.ఇంతకీ అతనెవరో మీకు అరమయ్యే ఉంటుంది.
చిరంజీవి( Chiranjeevi ).కాదు కాదు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

చిరంజీవి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా. మెగాస్టార్ ( Megastar )అని అంటూ ఉంటారు… అసలు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది.ఎవరు ఇచ్చిరు.? అన్న సంగతి చాలా మందికి తెలియదు.టాలీవుడ్ లో అగ్రనిర్మాతగా వెలుగొందిన కే.ఎస్.రామారావు ( K.S.Rama Rao )చిరంజీవిని మెగాస్టార్ ను చేశారు.కే.
ఎస్.రామారావు ప్రొడెక్షన్ హౌజ్ ( KS Rama Rao Production House )క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా దాదాపు ఐదు చిత్రాలు తెరకెక్కాయి.
అందులో మొదట సినిమా `అభిలాష`.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఆ తర్వాత కే.ఎస్.రామారావు, చిరంజీవి కలయికలో ఛాలెంజ్, రాక్షసుడు ( Challenge, rakshasudu )వంటి చిత్రాలు వచ్చాయి.ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించాయి.అలాగే రాక్షసుడు మూవీతో చిరంజీవి తమ్ముడు నాగబాబు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.కే.ఎస్.రామారావు నిర్మాణంలో చిరంజీవి చేసిన నాలుగో సినిమా మరణ మృదంగం.
అయితే ఈ సినిమాలోనే తొలిసారి స్క్రీన్ పై చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ బిరుదును వేయించారు కే.ఎస్.రామారావు.ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు శాశ్వతం అయింది.అప్పటి వరకు సుప్రీం హీరోగా పిలుచుకునే చిరంజీవిని అందరూ మెగాస్టార్ అంటూ పిలవడం ప్రారంభించారు.
ఇక చిరంజీవి, కే.ఎస్.రామారావు కలయికలోవచ్చిన అఖిరి చిత్రం `స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్`.ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ఈ సినిమా కి.డైరెక్షన్ చేసిన యండమూరి వీరేంద్రనాథ్ వల్లే ఈ సినిమా ప్లాప్ అయింది అని వీరేంద్ర నాథ్ గారే ఒప్పుకున్నారు ఎందుకంటే తనకి ఆ డైరెక్షన్ చేయడం అంతగా రాకపోవడం తో ఈ సినిమా ఎలా తియ్యలో తెలియక అలా తీశాను అది ప్లాప్ అయింది…అంటూ ఒక ఇంటర్ వ్యూ లో చెప్పారు…
.