అభిమానుల ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి!

సాధారణంగా హీరోహీరోయిన్లకి ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే వారి అభిమాన సెలబ్రిటీ గురించి మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ కేకలు వేసి గోల చేస్తుంటారు.

 Sai Pallavi Get Very Emotional About Fan Love, Sai Pallavi, Tollywood, Heroine,-TeluguStop.com

ఈ క్రమంలోనే తమ అభిమానులు తన పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం సాయి పల్లవి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే చిత్రంలో నటించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో భాగంగా చిత్రబృందం పాల్గొని ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలో నటి సాయి పల్లవి ఎమోషనల్ అయ్యారు.ఇక వేదిక పైకి సాయి పల్లవి మాట్లాడుతుండగానే అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేయడంతో ఒక్కసారిగా సాయి పల్లవి ఎమోషనల్ అవుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

సాధారణంగా ఒక సెలబ్రిటీ పట్ల అభిమానం ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Fan Love, Sai Pallavi, Tollywood-Movie

కానీ సాయిపల్లవి పేరు వినగానే తన అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు.ఇలా సాయి పల్లవి ఏడవటంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో నాని ద్విపాత్రాభినయంలో నటించగా సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube