సిరి షన్ను రొమాన్స్... పాపం ఆ ముగ్గురన్న హరితేజ.. కుళ్ళుని బయటపెట్టిన శ్రీరామచంద్ర!

బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి ఈ రోజుతో ముగింపు దశకు చేరుకోనుంది.ఇక ఈ సీజన్ లో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో అనేది బాగా ఆసక్తి గా మారింది.19 మంది కంటెస్టెంట్ లతో ఈ షో ప్రారంభం కాగా ఈ రోజు చివరి దశకు ఐదుగురు కంటెస్టెంట్ లు మిగిలారు.

 Siri Shannu Romance Hariteja Comment On Them Sriram Chandra Feel So Jealous Bigg-TeluguStop.com

ఈ సీజన్ ప్రారంభం నుంచి బాగా హైలెట్ గా మారింది.

ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల మధ్య జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే.తమ మాటలతో, ఆటలతో, గొడవలతో ఈ సీజన్ ను బాగా హైలెట్ చేశారు.

వాళ్లు కూడా బాగా హైలెట్ గా మారారు.ఇక ఇందులో మధ్య మధ్యలో లవ్ ట్రాక్ లు, రొమాన్స్ లు కూడా ఎక్కడా తగ్గలేవనే చెప్పాలి.

అందులో ముఖ్యంగా షణ్ముఖ్, సిరి.వీరిమధ్య జరిగిన రొమాన్సులు అంతా ఇంతా కాదు.

వీరు చేసే రొమాన్స్ లను చూస్తే ప్రేక్షకులు నోటిమీద వేలేసుకున్నారు.పైగా వీరిద్దరు రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు.

అయినా కూడా ఈ హౌస్ లో ఇలా ప్రవర్తించడం తో వీరికి విమర్శలు కూడా వచ్చాయి.

Telugu Bigg Boss, Hari Teja, Shiva Balaji, Siri Shannu, Sriram Chandra, Telugu-M

షో ప్రారంభం లో షణ్ముఖ్ కు మంచి ఫాలోయింగ్ అందింది.కానీ మధ్యలో సిరి అడ్డురావడంతో పైగా అతడు కూడా సిరితో ఓవర్ గా ప్రవర్తించడం వల్ల తన ఫాలోయింగ్ మొత్తం తగ్గిపోయింది.సోషల్ మీడియాలో షణ్ముఖ్ ను మాత్రం దారుణంగా ట్రోల్స్ కూడా చేశారు.

ఓవైపు సిరి కూడా దారుణమైన కామెంట్లను ఎదుర్కొంది.

Telugu Bigg Boss, Hari Teja, Shiva Balaji, Siri Shannu, Sriram Chandra, Telugu-M

ఇక వీరు బయట ప్రపంచానికి కనిపించడం లేదు అన్నట్లుగా ఒకటే బెడ్ పై పడుకొని దుప్పట్లు కప్పుకుని తెగ రొమాన్స్ లు చేస్తూ బాగా నెగిటివిటీని తామే స్వాగతించుకున్నారు.పలుమార్లు నాగార్జున కూడా వీరిని ఉద్దేశించి చాలాసార్లు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు.అయినా కూడా వీళ్లల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

Telugu Bigg Boss, Hari Teja, Shiva Balaji, Siri Shannu, Sriram Chandra, Telugu-M

ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ రొమాన్స్ తో  రెచ్చిపోయారు.ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మాజీ కంటెస్టెంట్ లతో సరదాగా కాసేపు సమయాన్ని గడిపే అవకాశం కల్పించాడు బిగ్ బాస్.అలా పలువురు కంటెస్టెంట్ లు వచ్చి ఇప్పుడున్న కంటెస్టెంట్ లతో బాగా సందడి చేశారు.

Telugu Bigg Boss, Hari Teja, Shiva Balaji, Siri Shannu, Sriram Chandra, Telugu-M

తాజాగా శివ బాలాజీ, హరితేజలు కూడా వచ్చారు.ఇక హరితేజ గురించి, ఆమె మాట్లాడే సూటిపోటి మాటలు గురించి అందరికీ తెలిసిందే.కానీ తాజాగా షన్ను, సిరి రొమాన్స్ ల మీద నేరుగా కాకుండా పరోక్షంగా పంచ్ లు వేసింది.

ఇక అబ్బనీ తీయని దెబ్బ అనే పాటతో హరితేజ వెరైటీగా పాడితే శ్రీ రామచంద్ర వెంటనే కనిపెట్టాడు.

దాంతో బిగ్ బాస్ ఈ పాటను ప్లే చేయగా కంటెస్టెంట్ లందరు డాన్స్ చేశారు.

షణ్ముఖ్, సిరి మాత్రం మళ్లీ రొమాన్స్ చేశారనే చెప్పవచ్చు.సన్నీ, మానస్, శ్రీ రామచంద్ర ఒంటరిగా చేయటంతో వారి పరిస్థితి చూడు అని హరితేజ వారి పై కౌంటర్ వేసింది.

ఇక శ్రీరామచంద్ర.మా బాధ అర్థం చేసుకొని సిరిని సర్ప్రైజ్ ఎలిమినేషన్ చేశాడని సంబరపడ్డాం.

కానీ కొద్దిసేపటికే కన్ఫ్యూజన్ రూమ్ లో నుంచి షన్ను అనుకుంటూ వచ్చింది అంటూ తన కుళ్ళును బయటపెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube