నాన్నకు.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌

ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాలున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

 Kiaara Sandhu Review On Nannaku Preamtho-TeluguStop.com

ఇక ఈ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేందుకు దుబాయి ఇండియన్‌ సినిమా మ్యాగజైన్‌ రిపోర్టర్‌ కిఅరా సంధు ఈ చిత్రంకు బ్లాక్‌ బస్టర్‌ అంటూ రివ్యూ ఇచ్చింది.

‘బాహుబలి’ సినిమా నుండి కూడా కిఅర సంధు రివ్యూకు ఇండియాలో బాగా ప్రాముఖ్య పెరిగింది.

హిందీ సినిమాలతో పాటు తెలుగు స్టార్‌ హీరోలు నటించిన సినిమాలకు సైతం రివ్యూలు ఇచ్చే ఈమె ‘శ్రీమంతుడు’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అని, మహేష్‌బాబు క్రేజ్‌ డబుల్‌ అవుతుంది అంటూ రివ్యూ ఇచ్చింది.ఆమె అన్నట్లుగానే ‘శ్రీమంతుడు’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యి, గత సంవత్సరం బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాల జాబితాలో నిలిచింది.

‘బ్రూస్‌లీ’ ఫ్లాప్‌ అని ఈమె రివ్యూ ఇచ్చింది.అదే ఫలితం వచ్చింది.

తాజాగా ఈమె ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం గురించి స్పందించింది.తాను ఈ చిత్రం ఫస్ట్‌ కాపీ చూశాను అని, ఎన్టీర్‌ ఫుల్‌ స్టైలిష్‌గా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు టేకింగ్‌ కూడా అద్బుతంగా ఉందని, తప్పకుండా ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అంటూ ఈమె రివ్యూ ఇచ్చింది.

దాంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube