నేను ట్యూన్లు కాపీ కొడతానని చెప్పేవాళ్లకు సమాధానమిదే.. కోటి కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో కోటి ఒకరనే సంగతి తెలిసిందే.అప్పట్లో ఎందుకో నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనాలని అనిపించిందని బాలయ్య సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సినిమాను కొనుగోలు చేశానని అయితే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదని కోటి అన్నారు.

 Music Director Koti Shocking Comments About Copy Tunes Details Here ,music Direc-TeluguStop.com

ఆరోజుల్లో 8 లక్షలకు తాను కొనుగోలు చేశానని కోటి చెప్పుకొచ్చారు.కోదండరామిరెడ్డి డైరెక్టర్ కావడంతో సూపర్ డూపర్ హిట్ అనుకున్నానని ఆయన తెలిపారు.
తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఆ విధంగా పోగొట్టుకున్నానని ఇది ఒక గుణపాఠమని ఆయన అన్నారు.ఎవరు చేసే పని వాళ్లు చేయాలని తనకు అనిపించిందని కోటి తెలిపారు.

కాపీ ఆరోపణల గురించి కోటి స్పందిస్తూ కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ ను తెలుగులో చేసిన సందర్భాలు ఉన్నాయని పక్క రాష్ట్రాల నుంచి తాను సాంగ్స్ ను కాపీ చేయడం మాత్రం ఎప్పుడూ జరగలేదని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Balakrishna, Chiranjeevi, Copy, Koti, Music Koti-Movie

తెలుగు పాటలను ఇతర భాషల్లో పెట్టామని ఆయన వెల్లడించారు.మ్యూజిక్ కంపోజర్ అంటే ఏంటని ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల పాటలను కాపీ కొట్టడం కాదని కోటి తెలిపారు.అయితే దర్శకనిర్మాతల కోరిక మేరకు కొన్నిసార్లు కాపీ చేయాల్సి వస్తుందని కోటి కామెంట్లు చేశారు.

మేము కావాలని కాపీ చేసిన సందర్భాలు లేవని ఆయన తెలిపారు.అసోసియేషన్ నుంచి నాకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదని ఆయన అన్నారు.

ఏదైనా సూపర్ హిట్ సాంగ్ ను చూపించి సాంగ్ చేయమని చెబితే ఆ ఫ్లేవర్ తో సాంగ్స్ చేస్తామని కోటి తెలిపారు.చిరంజీవి గారి సినిమాకు సాంగ్స్ అంటే చాలా భయం వేసేదని కోటి తెలిపారు.

ప్రతి పాటను సక్సెస్ చేయాలని ఆ ఒత్తిడి ఉంటుందని కోటి చెప్పుకొచ్చారు. చిరంజీవి గారి సినిమాలకు హోమ్ వర్క్ ఎక్కువగా చేసి చేసేవాళ్లమని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube