అన్నపూర్ణా దేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుంది?

దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీ దేవిగా జన్మిస్తుంది.పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.

  why Annapurna Devi Gives Alms To Lord Shiva Details, Annapruna Devi, Paramashi-TeluguStop.com

పరమ శివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు.ఆ విషయం తెలుసుకొని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది.

దాంతో శివుడు చలించకోపవడంతో మన్మథుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు.దానితో ఈశ్వరుడు ఆగ్రుడవుతాడు.

మూడో కన్నుతో మన్మథుడిని భస్మం చేస్తాడు.ఆ తర్వాత ఆ భోళా శంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు.

పార్వతికి ఏం చేయాలో తెలియదు.అప్పుడు నారద మహర్షి పార్వతీ దేవితో కొన్ని విషయాలు చెబుతాడు.తల్లీ పరమ శివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు.కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్లి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు… భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు.

నారద మహర్షి చెప్పినట్టు పార్వతీ దేవి అన్నదానం చేస్తూ… అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింప పడుతున్న సమయంలో మహా శివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు.పార్వతీ దేవి భర్తను గుర్తు పట్టి చేయి పట్టుకుంటుంది.

దానితో భోళా శంకరుడికి సర్వమూ అర్థమై పార్వతీ దేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు.అప్పటి నుంచి పార్వతీ దేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది.

కాశీ విశ్వేశ్వరుడిగా మహా శివుడు వెలిశాడు.ఇలా అన్నపూర్ణ దేవి ఆ భోళా శంకరుడికి భిక్షం వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube