సాధారణంగా స్వస్తిక్ గుర్తును అదృష్టం, ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు.ఈ స్వస్తిక్ గుర్తును కేవలం హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు వంటి మతాలకు చెందిన వారు కూడా ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.
ఈ స్వస్తిక్ గుర్తును మనం ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ గుర్తును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.సంస్కృతంలో స్వ అంటే మంచి, అస్తి అంటే కలగటం స్వస్తిక్ అంటే మంచిది కలగచేసేది అని అర్థం.
మన హిందూ సాంప్రదాయాలలో ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముందుగా “ఓంకార” చిహ్నాన్ని ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం.ఓంకారం తరువాత అంతటి ప్రాముఖ్యత స్వస్తిక్ చిహ్నాన్నికి కలిగి ఉంటుంది.
స్వస్తిక్ చిహ్నంలో మనకు నాలుగు గీతలు కనిపిస్తాయి.ఈ నాలుగును నాలుగు వేదాలుగా సూచిస్తుంది.
అంతేకాకుండా స్వస్తిక్ ను నాలుగు లక్ష్యాలుగా కామం, మోక్షం, ధర్మం, అర్థంతో పాటు నాలుగు దిక్కులను,నాలుగు యుగాలను కూడా సూచిస్తుంది.

ఇంతటి పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ ను శనివారం రంగులతో వేసి దానిపై బియ్యం, రాగులు, జొన్నలు వంటి ధాన్యాలతో అలంకరించాలి.తరువాత ఆ నాలుగు గీతల పై తమలపాకులను ఉంచి తమలపాకుల పై దీపాలను వెలిగించడం ద్వారా మనం అనుకున్న కార్యక్రమాలు ఏవైనా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విగ్నంగా సాగుతాయి.అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.
ఇంతటి పవిత్రమైన స్వస్తిక్ రంగోలిని ఎక్కువగా శనివారం వేసుకొని పూజ చేయటం వల్ల సకల సంతోషాలను కలిగి ఉంటారని అంతేకాకుండా స్వస్తిక్ రంగోలిని ఎక్కువగా దీపావళి పూజలలో, కార్తీక దీపం పూజలలో ఉపయోగిస్తుంటారు.మనం ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు మొదటగా ఓంకారం, స్వస్తిక్ చిహ్నాలను వేసి ఆ పూజా కార్యక్రమాన్ని మొదలుపెడతారు.
ఇలా చేయటం వలన కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని పండితులు చెబుతున్నారు.