పురాణాల ప్రకారం కార్తీక మాసం కృష్ణ పక్షం రోజున సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని భావిస్తారు.ఈ క్రమంలోనే కార్తీక మాస అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టిన దినంగా భావించి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో వేడుకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
ఈ దీపావళి పండుగ రోజు ఇల్లు మొత్తం దీపాలతో ఎంతో అందంగా అలంకరించి ఈ పండుగను జరుపుకుంటారు.అయితే దీపావళి పండుగ రోజు కేవలం లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా వినాయకుని కూడా పూజిస్తారు.
ముందుగా వినాయకుడి పూజ చేసిన అనంతరం లక్ష్మీదేవికి పూజ చేయాలని అలా చేసినప్పుడే ఆ పూజ కు ఫలితం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.అసలు దీపావళి రోజు వినాయకుడికి ఎందుకు పూజ చేయాలి అనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదకు, ఐశ్వర్యాలకు చిహ్నంగా చిహ్నంగా భావిస్తారు.
అందుకు లక్ష్మీదేవి ఎంతో గర్వ పడుతుంది.అయితే లక్ష్మీదేవి గర్వాన్ని అనచాలని భావించిన విష్ణుదేవుడు ఆమె గర్వం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఒక స్త్రీ తాను స్త్రీగా పరిపూర్ణం కావాలంటే ఆమె తల్లి కావాలని విష్ణుమూర్తి చెప్పడంతో ఆ మాటలకు లక్ష్మీదేవి ఎంతో నిరాశ చెందుతుంది.
ఈ క్రమంలోనే ఈ బాధలో లక్ష్మీదేవి పార్వతీ దేవి వద్దకు వెళ్లి తనకు ఒక పుత్రుడిని దత్తతగా ఇవ్వాలని అడుగుతుంది.

ఇక లక్ష్మీదేవికి స్థిరత్వం లేదని,ఆమె ఒక చోట ఎప్పుడూ ఉండదని గ్రహించిన పార్వతీదేవి తనకు కొడుకుగా వినాయకుడిని దత్తత ఇస్తుంది.దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోష పడి ఎవరైతే సంపద శ్రేయస్సు కావాలని భావిస్తారి వారు ముందుగా వినాయకుడికి పూజ చేయాలి.వినాయకుడి పూజ అనంతరం తనకు పూజ చేసినప్పుడే ఫలితం దక్కుతుందని చెప్పడం వల్ల దీపావళి పండుగ రోజు ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం లక్ష్మీదేవికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.