టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు.భారీ బడ్జెట్ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు నటిగా తన రేంజ్ ను పెంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.
యశోద సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బాయ్స్, ప్రేమిస్తే సినిమాలలో హీరోయిన్ గా అవకాశం వచ్చినా తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాలలో నటించలేదని ఆమె అన్నారు.
నాకు పని అంటే పిచ్చి అని పని మొదలుపెడితే పూర్తయ్యే వరకు నిద్రపోనని ఆమె తెలిపారు.నటనని కూడా నేను అదే విధంగా భావిస్తానని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం సినిమా మాత్రమే నా ప్రపంచం అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నేను మంచి నటిని అనిపించుకోవాలని భావిస్తున్నానని వరలక్ష్మి వెల్లడించారు.
నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆమె పేర్కొన్నారు.బాయ్స్, ప్రేమిస్తే సినిమాలు భారీ సక్సెస్ సాధించినా ఆ సినిమాలను వదులుకున్నానన్న బాధ నాకు ఏ మాత్రం లేదని ఆమె కామెంట్లు చేశారు.
జయమ్మ తరహా పాత్రలకు నేనే ఆప్షన్ అని వరలక్ష్మి వెల్లడించారు.బాల గారు నాకు గురువు అని ఆమె అన్నారు.బాల గారి డైరెక్షన్ లో నటిస్తున్న సమయంలో కాలర్ బోన్ విరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

వీరసింహారెడ్డి సినిమాలో ఐదు పేజీల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పడం మెమొరబుల్ మూమెంట్ అని నేను అలా చెప్పడంతో బాలయ్యతో సహా యూనిట్ అంతా చప్పట్లు కొట్టిందని ఆమె కామెంట్లు చేశారు.కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొనే అమ్మాయిలకు మాత్రమే ఆ బాధ తెలుస్తుందని వరలక్ష్మీ శరత్ కుమార్ వెల్లడించారు.







