రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక చౌరస్తా వద్ద జిల్లాకి వచ్చి పోయే వాహనాల నంబర్లను గుర్తించడానికి ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సీసీ కెమెరాలు, కోదురుపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాలు,ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలు, జిల్లాకు వచ్చే అనుమానిత వాహనాలను గుర్తించేందుకు జిల్లా సరిహద్దుల్లో ఆధునిక ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,అందులో భాగంగా ఈ రోజు కోదురుపాక చౌరస్తా వద్ద రెండు ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
తద్వారా వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ ర్యాష్ డ్రైవింగ్ చేసినా,అనుమానిత వాహనాలు వచ్చిన ఈ ఆటోమేటిక్ సిసి కెమెరాల ద్వారా గుర్తించడాం జరుగుతుందన్నారు.వీటి ఆధారంగా నిబంధనలు ఉల్లఘించిన వాహనాలను, అనుమానిత వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన 05 సీసీ కెమెరాలను ప్రారంభించి , నేరాల నియాత్రణలో,కేసులో చెదనలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయన పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.ఎస్పీ వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ పృథ్వీందర్ గౌడ్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.