తరచు కడుపునొప్పి వస్తుందా.. అయితే ఇలా చేయండి..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.కడుపులోని ప్రేగులలో వాయు నిండినప్పుడు కడుపులో ఉబ్బరంగా ఉంటుంది.

 Do You Get Stomach Ache Often But Do This , Stomach Ache , Digestive System,app-TeluguStop.com

ఈ స్థితిలో కడుపులో వాపు, నొప్పిగా ఉండే అవకాశం ఉంది.ఇది చాలా కారణాల వల్ల జరగవచ్చు.

ఆహారాన్ని సమయానికి తినకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు.కొన్ని సందర్భాల్లో రకరకాల ఆహారాలు ఒకేసారి తినడం వల్ల కూడా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

కడుపునొప్పి వచ్చేటప్పుడు కొంతమంది కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది.

కానీ ఒక్కొక్కసారి ఈ కడుపునొప్పి తీవ్రంగా పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

అందుకే కడుపునొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఎంతో మంచిది.అంతేకాకుండా మలబద్ధకం వాయువు చేరడం మొదలైన వాటి వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

అదే సమయంలో కొన్ని అలవాట్లు కూడా వాపు కారణమవుతాయి.వీటిలో చాలా వేగంగా తినడం, చూయింగ్ గం నమ్మడం, ధూమపానం మొదలైనవి ఉంటాయి.

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలను పాటించడం ఎంతో మంచిది.

Telugu Apple Vinegar, Gum, Fast, Tips, Stomach Ache-Telugu Health

ఆపిల్ వెనిగర్ జీర్ణ రసాన్ని ఉత్పత్తి చేస్తుంది.దీనివల్ల నొప్పి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపి తాగితే కడుపునొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది.

హెర్బల్ టీ లో ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.ఈ లక్షణాలు ఉండటం వల్ల కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.ఒక కప్పు టీ తాగడం ద్వారా శరీరానికి, మనసుకు ఎంతో విశ్రాంతి దొరుకుతుంది.

అంతేకాకుండా శరీరక శ్రమ అనేది వాయువును బయటకు తీయడానికి సులభమైన మార్గం.కడుపు ఉబ్బరం నుంచి బయటపడడానికి యోగ, స్కిప్పింగ్ వంటివి చేస్తూ ఉండాలి.

కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube