బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా( Sheikh Hasina ) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను, ప్రముఖుల నివాసాలే టార్గెట్‌గా విధ్వంసానికి తెగబడుతున్నాయి.
అయితే ఆందోళనల ముసుగులో మతపరమైన హింస చోటు చేసుకుంటుండటం, ముఖ్యంగా హిందువులు , హిందూ ఆలయాలను ధ్వంసం చేయడంతో అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్రా ఆర్య( MP Chandra Arya ) స్పందించారు.
ఈ మేరకు కెనడియన్ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేసిన ఆయన.బంగ్లాదేశ్‌లో( Bangladesh ) హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్దితులను ఎత్తిచూపారు.బంగ్లాదేశ్‌లో అస్ధిరత ఉన్న కాలంలో.ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు( Hindus ) ఎక్కువగా నష్టపోతారని చంద్ర ఆర్య అభిప్రాయపడ్డారు.బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆ దేశ జనాభాలో మతపరమైన మైనారిటీల వాటా గణనీయంగా తగ్గిందని ఆయన వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల క్షేమ సమాచారం కోసం కెనడియన్ హిందువులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని ఆర్య తెలిపారు.దీనిపై అవగాహన పెంచేందుకు గాను సెప్టెంబర్ 23న కెనడియన్ పార్లమెంట్ ముందు తాము ర్యాలీకి ప్లాన్ చేశామని.ఇందులో బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న కెనడియన్ బౌద్ధులు, క్రైస్తవుల కుటుంబాలు కూడా పాల్గొంటాయని ఆయన వెల్లడించారు.
ఇదిలాఉండగా.మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృందం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు( Dhaka ) చేరుకుంది.చంద్ర ఆర్య.భారత్‌లోని కర్ణాటకలోని తుముకూరుకు చెందినవారు.
రెండేళ్ల క్రితం కెనడియన్ పార్లమెంట్‌లో తన మాతృభాష అయిన కన్నడంలో స్పీచ్ ఇచ్చి సంచలనం సృష్టించారు.కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లోని అంటారియోలోని నేపియన్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్‌కు ఆర్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు.