పరిశోధనలు ,శాస్త్రవేత్తల కోసం యూకే నూతన వీసా విధానాన్ని ప్రవేసపెట్టింది…పరిశోధనా రంగంలో తమ దేశాన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఎంతో అభివృద్ధి చెందేలా చేసేందుకు యూకే ఆలోచన చేసింది అందులో బాగంగానే శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం ఈ వీసాలను ప్రవేశపెట్టింది.అందుకోసం యూకేఆర్‌ఐ సైన్స్ , రీసెర్చ్ ,అకడమియా పేరుతో సరికొత్త వీసా విధానాన్ని ప్రారంభించింది…ఈ వీసా నిభందన ప్రకారం యూకే లో ఉన్న బయట నుంచీ వచ్చిన శాస్త్రవేత్తలు…పరిశోధకులు రెండు సంవత్సరాలు యూకేలో ఉండచ్చు.
ప్రపంచంలో ఉన్న పరిశోధకులకు యూకేలో పనిచేయడానికి, శిక్షణ పొందడానికి సులువు అవుతందని యూకే ఇమ్మిగ్రేషన్ మంత్రి కరోలినే నోక్స్ తెలిపారు.అయితే ఇలాంటి వారిని ఆకర్షించడానికి తప్పకుండా యూకేకు మంచి వలసవిధానం ఉండాలని, దాని వల్ల నిపుణుల మేధస్సు తమ దేశానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.శాస్త్ర సాంకేతిక రంగంలో నిపుణుల సహకారం ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ఎంతో కీలకమని తెలిపారు.
అయితే తాజాగా ప్రవేసపెట్టిన ఈ వీసాలు యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్(యూకేఆర్‌ఐ) నిర్వహిస్తుందని తెలిపారు…అంతేకాదు యూకేఆర్‌ఐ కింద ఆమోదం పొందిన 12 రీసెర్చ్ సంస్థలు ఉన్నాయని ఈ వీసాల ద్వారా ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఇప్పుడు నేరుగా యూకేలో పనిచేసుకోవడానికి, శిక్షణ పొందడానికి స్పాన్సర్ చేయవచ్చునని తెలిపింది.