చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు కానీ ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే తప్పకుండా అది రాజకీయాలని మలుపు తిప్పుతూ పార్టీకి మంచి మైలేజ్ తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు.అయితే ఇప్పుడు ఉన్న పొలిటికల్ హీట్ లో బాబు మాత్రం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.
అయితే చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి.? రాజకీయాలలో సరికొత్త వొరవడి ఎలా తీసుకొస్తున్నారు అంటే వివరాలలోకి వెళ్తే…దిమ్మతిరిగే బాబు స్కెచ్ అర్థం అవుతుంది.
జనసేన పార్టీ కొన్ని నెలల క్రితం తాము ఎలాంటి నేతలకి టిక్కెట్లు ఇస్తాము అంటే అంటూ ఒక ప్రకటన జారీ చేసింది తనకి కావాల్సిన అభ్యర్ధులలో కొంతమందిని గతంలో పొలిటికల్ అనుభవం లేకపోయినా స్వచ్చందా సేవలు చేస్తూ ప్రజలలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ కూడా సిద్దం చేశారని తెలిసింది.అయితే చంద్రబాబు కూడా ఇదే రకమైన స్కెచ్ లో ఉన్నారని టాక్.తమ గెలవలేని సిట్టింగు ఎమ్మెల్యేల స్థానంలో వారిని గుర్తించారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు లోకేష్ చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారని టాక్ కూడా వినిపిస్తోంది.
అంతేకాదు లోకేష్ కావాలని పట్టుబట్టి మరీ స్వచ్చంద సేవకులకి ఇవ్వాలని అడిగారట అయితే ఈ చంద్రబాబు ఈ విషయంలో లోకేష్ కి పూర్తీ స్వేచ్చని ఇచ్చారని తెలుస్తోంది.ఎందుకంటే స్వచ్చంద సేవకులు చేసే ఉదారమైన సేవలకి ఒక స్థాయి ఎమ్మెల్యేల కంటే కూడా ప్రజలలో మంచి గుర్తింపు ఉంది ఎంతో మంది సైతం మా ఎమ్మెల్యే కంటే ఇలాంటి సేవ చేసేవాళ్ళు బెటర్ అనుకునే సందర్భాలు సైతం ఎన్నో ఉన్నాయి.
అందుకే ఈ సారి స్వచ్ఛంద సేవకులకి కొన్ని సీట్లు కేటాయించనున్నారట.కానీ
దానికి పూర్తి స్థాయి నేతృత్వం వచించేది మాత్రం చంద్రబాబేనట.
చివరిగా అభ్యర్ధిని డిసైడ్ చేసేది మాత్రం చంద్రబాబే అయితే సుమారు 7 టిక్కెట్లు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద సేవకులకి ఇవ్వనున్నారు.తెలుగుదేశం పార్టీ తో సంభంధం ఉన్నా లేకపోయినా సరే సేవ చేస్తూ ప్రజలలో పూర్తీ స్థాయి ఆదరణ కలిగి ఉన్న వ్యక్తులని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అయితే ఇప్పటికే వారిని జిల్లాల వారిగా గుర్తించారని టాక్ వినిపిస్తోంది శ్రీకాకుళం జిల్లా నుంచీ ఒకరు.
మరియు కృష్ణా జిల్లా మరొకరు.చిత్తూరు జిల్లా నుంచీ ఇద్దరినీ గుర్తించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికే నలుగురిని గుర్తించగా మరో ముగ్గురు ఎంపిక అవ్వగానే చంద్రబాబే మీడియా సమావేశంలో వెల్లడి చేస్తారని టాక్ వినిపిస్తోంది.