ఈ భూమి మీద జీవిస్తున్న ప్రజలందరికీ ప్రతిరోజు నిద్ర కచ్చితంగా ఉండాలి.ఎందుకంటే నిద్రతోనే మన శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది.
కంటి నిండా నిద్ర లేకపోతే శరీరం ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది.కంటినిండా నిద్రపోతే గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి ఎన్నో రోగాల ముప్పు ఉంది.
నిద్ర ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోతే పగటి పూట నిద్రపోతారు.
పగటిపూట నిద్ర అలవాటైతే మీకు రాత్రులు ఏం చేసినా నిద్ర రాదు.పగటిపూట నిద్ర జీవక్రియను తగ్గిస్తుంది.
ఇంకా చెప్పాలంటే కంటి నిండా నిద్ర లేకపోతే అలసట, చిరాకు, రోగ నిరోధక శక్తి బలహీనపడడం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.అంతేకాకుండా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి.

అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు రాత్రి పూట హాయిగా నిద్రపోతారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సరేనా సమయంలో నిద్ర నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.అప్పుడే నిద్ర త్వరగా పడుతుంది.అందుకే రాత్రి నిద్రపోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవడం మంచిది ఎప్పుడు నిద్ర పోవాలి.ఎప్పుడు నిద్ర మేల్కోవాలి అనేది కచ్చితంగా నిర్ణయించుకోవడం మంచిది రాత్రి నిద్ర పోవడానికి రెండు గంటల ముందు మొబైల్ ఫోన్ టెలివిజన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకూడదు.
లైట్ ఆఫ్ చేసి నిద్రపోవడం అలవాటు చేసుకోండి.

రాత్రి పడుకునే ముందు అతిగా తింటే సరిగా నిద్ర పట్టలేదు.అందుకే నిద్రపోవడానికి రెండు నుంచి మూడు గంటల ముందే తగిన మోతాదులో తినడం మంచిది.రాత్రిపూట వేయించిన నూనె, కారంగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది.
ఎందుకంటే ఇవి కూడా నిద్రను భంగం కలిగిస్తాయి.ఒత్తిడి కూడా మనకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
అందుకే ఒత్తిడి తగ్గేందుకు యోగా ధ్యానం చేయాలి.వ్యాయామం కూడా నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది.