ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చర్చల్లో నిలిచే అంశాలలో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒకటి.ఏళ్ళు గడుస్తున్నప్రభుత్వాలు మారుతున్న ఇంతవరకు ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కాకపోవడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చేసేవారు కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్ విషయంలో పనులు ఎలా జరుగుతున్నాయనేది మిస్టరీగానే మారింది.గత ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ పోలవరాన్ని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని బల్లగుద్ది చెప్పారు కానీ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఆయన మంత్రి పదవి నుంచి వైదొలగారు.
![Telugu Ambati Rambabu, Chandra Babu, Cm Jagan, Narendra Modi-Politics Telugu Ambati Rambabu, Chandra Babu, Cm Jagan, Narendra Modi-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Narendra-Modi-Ambati-Rambabu-ycp-CM-jagan-Anil-Kumar-Yadav-ycp.jpg)
ఇక ఇప్పుడు ఇరిగెఃసన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబరు( Ambati Rambabu ) అసలు పోలవరం గురించి ప్రస్తావించిన సందర్భలే చాలా తక్కువ అనే విమర్శలు ఉన్నాయి.ఇక మరో ఎనిమిది నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో పోలవరం పక్కా పూర్తి చేస్తామని చెప్పన వైఎస్ జగన్ ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలా ఎన్నికల ప్రచారనికి వెలతారనేది అసక్తికరంగా మారింది.ఇక తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Telugu Ambati Rambabu, Chandra Babu, Cm Jagan, Narendra Modi-Politics Telugu Ambati Rambabu, Chandra Babu, Cm Jagan, Narendra Modi-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Narendra-Modi-Ambati-Rambabu-ycp-CM-jagan-Anil-Kumar-Yadav.jpg)
పోలవరనికి నిధుల కొరత ఉందని, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతున్నామని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని స్పష్టంగా తేల్చి చెప్పారు.దీంతో పోలవరం ప్రాజెక్ట్( Polavaram Project ) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్లే తెలుస్తోంది.ప్రస్తుతం నిధుల కోసం కేంద్రం పై ఆధార పడిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఉంటుందా లేదా ప్రాజెక్ట్ పూర్తి చేస్తే భాద్యతను కేంద్రమే భుజాన వెస్కుంతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తుందని, అందుకే ప్రాజెక్ట్ ను కేంద్రానికి అప్పగించాలని బీజేపీ నేతలు చెబుతున్నారు.మరి ముందు రోజుల్లో జగన్ సర్కార్ పోలవరం విషయంలో ఎలా ముదుకు వెళుతుందో చూడాలి.