కరీంనగర్ జిల్లాలో కుక్కల స్వైరవిహారం చేస్తున్నాయి.శంకరపట్నం ఎస్సీ హాస్టల్ లోకి చొరబడి విద్యార్థిపై దాడికి పాల్పడ్డాయి.
కాగా కుక్కల దాడిలో విద్యార్థి సుమంత్ కు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
గమనించిన స్థానికులు బాధిత విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు వీణవంక మండలం మల్లారెడ్డిపల్లెలో కూడా కుక్కలు ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కుక్కలు వెంబడించడంతో రాపాక యేసయ్య అనే వ్యక్తి బైకుపై నుంచి కిందపడ్డాడు.
బాధితుడికి ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు.దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.







