మరో ప్రపంచస్థాయి సంస్థకు భారత సంతతి సీఈవో... ఎవరీ దేవికా బుల్‌చందాని..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.

 Devika Bulchandani Enters The List Of Indian-origin Ceos Leading Global Companie-TeluguStop.com

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కోవలో డబ్ల్యూపీపీ యాజమాన్యంలోని గ్లోబల్ అడ్వర్టైజింగ్ కంపెనీ Ogilvyకొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన దేవికా బుల్‌చందానీ నియమితులయ్యారు.

పంజాబ్‌లోని ఆధ్యాత్మిక నగరం అమృత్‌సర్‌లో దేవిక జన్మించారు.2020లో Ogilvy లో చేరిన ఆమెనార్త్ అమెరికా గ్లోబల్ ప్రెసిడెంట్ , సీఈవోగా విధులు నిర్వర్తించారు.

Telugu Ceos, Indian Origin, America, Ogilvy, Priceless, Punjab, True-Telugu NRI

Ogilvyలో చేరడానికి ముందు దేవికా.దాదాపు 26 ఏళ్ల పాటు మెక్‌కాన్ సంస్థలో నార్త్ అమెరికా ప్రెసిడెంట్ సహా వివిధ హోదాల్లో పనిచేశారు.అలాగే మాస్టర్ కార్డ్ కోసం ప్రైస్‌లెస్, ట్రూ నేమ్ ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఇక దేవిక ప్రారంభించిన ‘‘ఫియర్‌లెస్ గర్ల్’’ క్యాంపెయినింగ్‌కు కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన ప్రచార కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube