కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తెలంగాణకు రానున్నారు.దీనిలో భాగంగా ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలతో పాటు బీజేపీ ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు.అయితే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్న కేసీఆర్.
కొత్త పార్టీ ఏర్పాటు విషయాన్ని కుమారస్వామికి వివరించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో జాతీయస్థాయిలో కలిసి రావాలని కోరనున్నారని సమాచారం.







