Suma : కొడుకుని హీరో చేయాలని అలాంటి చెత్త పని చేసిన సుమ.. ఆగ్రహం వ్యక్తం చేసిన రాజీవ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమా కనకాల ( Suma Kanakala )ఒకరు.ఈమె గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని యాంకర్ గా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ సినిమాని ఎంతో సక్సెస్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

 Anchor Suma Why Did She Take Up Acting-TeluguStop.com

ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఏదో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ కొడుకుని హీరోగా పరిచయం చేయాలని ఎన్నో కలలు కన్నారట.అయితే సుమ కుమారుడు రోషన్ ( Roshan ) ఇదివరకు ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

Telugu Raghavendra Rao, Roshan Kanakala, Anchor Suma, Suma Kanakala, Tollywood-M

ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించినటువంటి రోషన్ హీరోగా వెండి తెరపై సందడి చేయాలని సుమ ఎన్నో కలలు కన్నారు ఈ క్రమంలోనే తన కొడుకుని హీరోగా చేయాలన్న ఉద్దేశంతో ఈమె ప్రముఖ దర్శకుడు అయినటువంటి రాఘవేంద్రరావు( Raghavendra Rao ).గారి వద్దకు వెళ్లి తన కొడుకుని మీ దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరారట.రాఘవేంద్రరావు ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ఎంతోమంది హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సుమ కూడా రాఘవేంద్రరావు చేత తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయిస్తే తను కూడా స్టార్ అవుతారు అన్న ఉద్దేశంతోనే ఆయన వద్దకు వెళ్లి తన కొడుకుని ఇండస్ట్రీకి లాంచ్ చేయాలని కోరుకున్నారట.

Telugu Raghavendra Rao, Roshan Kanakala, Anchor Suma, Suma Kanakala, Tollywood-M

ఇలా సుమ అడగడంతో రాఘవేంద్రరావు నీ కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే నువ్వు నా కాళ్లు పట్టుకోవాలి అని అన్నారట.దీంతో సుమ నిజమే అనుకొని వెంటనే ఆయన కాళ్లపై పడ్డారు.దీంతో ఒక్కసారిగా షాక్ అయినా రాఘవేంద్రరావు నేను ఏదో సరదాగా అన్నానమ్మా అలా చేయకు ముందు పైకి లేవు నీ కొడుకును నాకన్నా మంచి దర్శకుల చేత ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయిస్తాము అంటూ సుమకు మాట ఇచ్చారట.అయితే సుమ తన కొడుకును పరిచయం చేయడం కోసం ఇలా రాఘవేంద్రరావు గారి కాళ్లు పట్టుకున్నారు అనే విషయం రాజీవ్ కనకాలకు ( Rajeev Kanakala )తెలియడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట.

కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి సక్సెస్ సాధించాలి అంటే ఇలా ఫలానా దర్శకుడుతోనే లాంచ్ చేయించాలని వారి కాళ్లు పట్టుకుంటేనే సక్సెస్ కారు అంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారట.మన కొడుకు ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే తనలో టాలెంట్ ఉండాలని టాలెంట్ ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతారు కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల సక్సెస్ రాదు అంటూ తనకు బాగా అర్థమయ్యేలా చెప్పారని తెలుస్తోంది.

ఏది ఏమైనా సుమా కుమారుడు బబుల్ గమ్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు ఈ సినిమాకు రవికాంత్ పేరేపు అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు తెలియాల్సి ఉంది.

ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసినటువంటి రోషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ పోస్టర్ టీజర్ కూడా భారీగానే అంచనాలను పెంచుతుంది.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube