టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి బోయపాటి శ్రీను (Boyapati Sreenu) అఖండ సినిమా తర్వాత స్కంద సినిమా( Skanda Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) శ్రీ లీల ( Sreeleela ) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది.
ఫుల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.అఖండ సినిమా తర్వాత బోయపాటి స్కంద సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా కోసం బోయపాటి( Boyapati Sreenu ) ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న విషయం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.ఇది మాత్రమే కాకుండా ఈ సినిమాలో వచ్చే లాభాలలో కూడా ఈయన వాటా తీసుకోబోతున్నట్లు సమాచారం. స్కంద సినిమా( Skanda Movie )సిల్వర్ స్క్రీన్ ప్రతాపంపై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మొత్తం 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే లాభాలను అందుకుందని చెప్పాలి.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ. 46 కోట్ల రేంజ్ లో జరిగింది.అలాగే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.
వీటితోపాటు సాటిలైట్స్ రైట్ హక్కులు, ఆడియో రైట్ ద్వారా స్కంద సినిమా విడుదలకు ముందే మంచి లాభాలను అందుకుందని చెప్పాలి.ఇలా ఈ సినిమా విడుదలకు ముందే మంచి లాభాలను అందుకోవడంతో ఈయన రెమ్యూనరేషన్ మరింత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఇలా ఈ లాభాలు అన్నింటితో పోల్చుకుంటే బోయపాటి (Boyapati Sreenu)ఈ సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్( Remuneration ) అందుకుంటారని తెలుస్తోంది.