ప్రస్తుత వ్యవసాయ రంగంలో( Agriculture ) రసాయన పిచికారి మందుల వినియోగం అధికంగా పెరుగుతోంది.దీంతో పంట దిగుబడి పెరిగిన పంట నాణ్యత మాత్రం పూర్తిగా తగ్గింది.
పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను తొలి దశలో అరికట్టకుండా.రసాయన పిచికారి మందులను అధికంగా ఉపయోగిస్తున్నారు.
రసాయన పిచికారి మందులు కొట్టడంపై పూర్తిగా అవగాహన కల్పించుకుంటే మంచి నాణ్యత గల దిగుబడి సాధించడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పురుగు వల్ల పంటకు నష్టం ఎంత ఉందో ముందే అంచనా వేయాలి.
నష్ట శాతం అధికంగా ఉంటే అప్పుడు మాత్రమే పురుగుమందులను( Pesticides ) పిచికారి చేయాలి.పొలాన్ని ఏ పురుగు ఆశించిందో గుర్తించిన తర్వాత ఏ పిచికారి మందులను ఉపయోగించాలో నిర్ధారించుకోవాలి.
నిర్దిష్టమైన స్థిర విస్తీర్ణంలో ఒకసారి చల్లడానికి సరిపడా పరిమాణం మేరకు మాత్రమే పిచికారి మందులు కొనుగోలు చేయాలి.ఎక్స్పైరీ డేట్ లేనివి కొనుగోలు చేయరాదు.
పిచికారి మందులను పరిశుభ్రమైన నీటితో( Clean Water ) కలిపి పిచికారి చేయాలి.అవసరం అయిన మేరకు మాత్రమే ద్రావకం తయారు చేసుకోవాలి.ఆ ద్రావణం చేతులతో కాకుండా ఏదైనా కర్ర లేదంటే ప్లాస్టిక్ గొట్టంతో మిశ్రమాన్ని కలుపుకోవాలి.ఇనుప కడ్డీలు లేదంటే తీగలతో మిశ్రమాన్ని కలపకూడదు.
పిచికారి మందును స్ప్రేయర్ ట్యాంక్ లో నిండుగా ఒలికి పోయేటట్లు కాకుండా కాస్త తక్కువగా నింపుకోవాలి.పిచికారి చేసే సమయంలో చేతులు, చెవులు, నోరు, కళ్ళు, ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.ద్రావకం తయారు చేసేటప్పుడు పొగ త్రాగడం, నీరు త్రాగడం, గుట్కాలాంటివి తినడం చేయకూడదు.పిచికారి మందు స్ప్రే చేసిన తర్వాత సబ్బుతో స్నానం చేసిన తర్వాతనే నీరు లేదంటే ఆహారం తీసుకోవాలి.