సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్

హైదరాబాద్ రాంగోపాల్ పేటలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.ఈ క్రమంలో ప్రమాదం జరిగిన భవనంలో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది.

 Government Is Serious About Secunderabad Fire Accident-TeluguStop.com

సికింద్రాబాద్ లోని మినిస్టర్ రోడ్డులో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం వాటిల్లింది.

ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగగా.రాత్రి 9.30 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.అయితే మాల్ సిబ్బంది ముగ్గురు భవనంలో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలో ఇవాళ అధికారులు గాలింపు చర్యలు చేపట్టనున్నారు.బిల్డింగ్ ను పరిశీలించిన అనంతరం జీహెచ్ఎంసీ టెక్నికల్ విభాగం నివేదికను సమర్పించనున్నారు.

నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా భవనం దగ్గరికీ పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube